యువనేస్తం పధకం అక్టోబర్ 2 నుంచి ప్రారంభం కానుంది. అప్పటి వరకు రిజిస్టర్ అయ్యి, వెరిఫై అయిన వారికి వచ్చే నెల నుంచి నెలకు వెయ్య నిరుద్యోగ బృతి ఇవ్వనున్నారు. అయితే, ఇలాంటి ప్రతిష్టాత్మిక పధకం పై, జగన్ బ్యాచ్ విషం చిమ్ముతూ, యువతని ఆందోళన పడేలాగా చేస్తున్నారు. అక్టోబర్ 2 నుంచి యువనేస్తం పధకం ప్రారంభం కాదని, ఇదంతా చంద్రబాబు ఎన్నికల స్టంట్ అంటూ, విషపు రాతలు రాపిస్తున్నాడు జగన్. నిరుద్యోగ బృతితో పాటు, నైపుణ్య శిక్షణ ఇస్తున్న ఇలాంటి పధకం పై, యువతలో ఆందోళన రేకెత్తించి, రాజకీయ ప్రయోజనం పొందాలనే దుర్మార్గపు కుట్ర పన్నారు. ఈ కుట్రలో జగన సొంత మీడియా, పేపర్ తో పాటు, జగన్ నియమించిన పైడ్ సోషల్ మీడియా కూడా ఇదే పనిలో ఉంది.
అయితే దీని పై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. యువనేస్తం పథకంపై వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యువనేస్తం అమలైతే తమ దుకాణం బంద్ అవుతుందని వైసీపీ భయం పట్టుకుందుని ఎధ్దేవా చేశారు. ఇప్పటికే 5లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారని, దరఖాస్తు చేసుకున్నవారిలో 2 లక్షల మందిని అర్హులుగా గుర్తించామన్నారు. నిరుద్యోగుల పొట్టకొట్టే ప్రయత్నాలు జగన్ మానుకోవాలని కొల్లు రవీంద్ర సూచించారు. యువనేస్తం నమోదుకు ఆఖరి తేదీ లేదని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిందని, అసత్యాలు ప్రచారం చేస్తున్న జగన్‌కు నిరుద్యోగులే బుద్ధిచెప్పాలని కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి యువనేస్తం పథకానికి అర్హులైన అభ్యర్థులు ఎప్పుడైనా నమోదు చేసుకోవచ్చని, ఇదో నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర యువజనాభ్యుదయ శాఖ సంచాలకులు భానుప్రకాశ్ తెలిపారు.
ఆధార్‌కు అనుసంధానించిన ఫోన్ నెంబర్ వివరాలను సరిచేసుకోవడం కేంద్రం ఎంపిక చేసిన కేంద్రాల్లో నిరంతరం కొనసాగుతుందన్నారు. నమోదులో విద్యార్హతపై ఫిర్యాదులుంటే సంబంధిత విశ్వవిద్యాలయాలను సంప్రదించి అర్హత ఉన్నవారిని వెంటనే ఎంపిక చేస్తున్నామన్నారు. భూమి, కారు వంటి అంశాలపై అభ్యంతరాలుంటే ఫిర్యాదుచేయవచ్చని, 2-7 రోజుల్లో వాటిని పరిష్కరిస్తున్నామన్నారు. ఆ తర్వాతా అభ్యంతరాలుంటే పరిశీలిస్తామని, పథకానికి అర్హులా కాదా అనే విషయాన్ని దరఖాస్తుదారు మొబైల్ నంబర్‌కు సందేశం వెళ్తుందన్నారు. ఫిర్యాదుల పరిష్కారానికి అంశాలవారీగా నోడల్ అధికారులను నియమించామన్నారు. యువనేస్తం పథకానికి ఐదు లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 1.60లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తయిందన్నారు. అందిన 80 వేలకుపైగా ఫిర్యాదుల్లో 50 శాతానికిపైగా పరిష్కరించామన్నారు.