చంద్రబాబు అలా నడిరోడ్డున కూర్చున్న దృశ్యం చూస్తే కొందరికి గుండె తరుక్కుపోయింది. కొందరికి డజను పెగ్గలు ఒకేసారిపడినంత కిక్కి వచ్చింది. ఇంకా చాలా మందికి విషయం ఏంటో అర్థం కాలేదు. ఇదే ఊపులో అధికార పార్టీ ఆంతరంగిక గుంపులో ఉన్న ఓ నాయకుడికి కామెంట్ అసలు కథ బయట పెట్టింది. ఉప సంఘం మీటింగ్ మీటింగ్ అంటూ మంత్రులంతా ఆయన చుట్టూ జేరి గంటలకొద్దీ మాట్లాడిన మాటల్లో భాగంగా ఇది కూడా దొర్లింది. ఇది రూమర్ కాదు. అంచనా అంత కన్నా కాదు. వ్యూహం వెనక ఉన్న విషయం మాత్రమే ! ఏంటి వాస్తవం ? జగన్ నిజంగానే రాజధాని మార్చాలనుకుంటున్నాడా ? మార్చి ఏం సాధిస్తాడు ?
రాజధానిని విశాఖకు విసిరి పారేయాలన్న లెక్కలో చాలా కోణాలు ఉన్నాయ్. ఒకటి విశాఖ చుట్టు పక్కల భూములతో పండగ చేసుకోవాలని, కొన్నాళ్లుగా తన వాళ్లు అక్కడే కొంటున్నారు కాబట్టి అందరికీ కలిసొస్తుందని ఒక ఆలోచన. రాజధాని వచ్చినా రాకపోయినా రియాల్టీకి బూమ్ మాత్రం వస్తుందిగా, అలాగన్నమాట. ఇక రెండోది రాజకీయ లెక్క. అది కూడా కేసీఆర్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. చంద్రబాబును చీల్చి చెండాలన్నది కేసీఆర్ తాపత్రయం ముందు నుంచి. అందుకే ఆయన ఓ మాట అంటూ ఉంటాడు. 23 జిల్లాల్లో ఉన్న పార్టీని 13 జిల్లాలకు పడగొట్టినా - అని. ఇప్పుడు ఏపీలో మొత్తం ఉన్న టీడీపీని కేవలం కోస్తాకే పరిమితం చేయాలన్నది ఎత్తుగడ. అంటే ప్రాంతీయ పార్టీ నుంచి ఉప ప్రాంతీయ పార్టీకి స్థాయికి దించాలన్నది వ్యూహం. అందుకే అటు ఉత్తరాంధ్ర అంటూ ఇటు రాయల సీమ అంటూ పుకార్లు రేపాడు. అటు రాజధాని పెడతా ఇటు హైకోర్టు ఇస్తా అంటూ ప్రచారం చేశాడు. చంద్రబాబు స్పందించే లోపే రెండు కళ్ల సిద్ధాంతం చెబుతాడు బాబు అంటూ వైసీపీ ఎదురు దాడి మొదలు పెట్టడం కచ్చితంగా రాజకీయ లెక్క.
తెలంగాణ సమయంలో చంద్రబాబు ఎలా ఇబ్బంది పడ్డాడో ఈ విషయంలో కూడా అలాగే పడతాడని, ఉత్తరాంధ్రలో టీడీపీని దెబ్బ తీయొచ్చని, రాజధాని విశాఖకు మార్చేందుకు చంద్రబాబు వ్యతిరేకం అని ప్రచారం చేయాలన్నది జగన్ ప్లాన్. ఇక సీమలోనూ అదే ఫార్ములా. నేను హైకోర్టు తెచ్చా. బాబు ఇవ్వలేదు అని చెప్పాలనుకున్నాడు. ఇంత హడావుడి సమయంలో కేసీఆర్ తో మీటింగ్ పెట్టుకున్నది కూడా అందుకే ! కానీ ఇప్పుడు చూస్తే కొరివితో తల గోక్కుక్కుంటున్నట్టు అయిపోయింది సీన్. ఉత్తరాంధ్రలో రెస్పాన్స్ సంగతి దేవుడెరుగు ఇప్పుడు అమరావతితోపాటు మిగతా 10 జిల్లాలూ రగులుతున్నాయ్. హైకోర్టు తేవడం అసాధ్యం అని సీమ తెలుసుకుంది. అయినా హైకోర్టు ఇస్తే ఏం లాభం ? మాకు రాష్ట్రం ఇచ్చేయండి అని అడుగుతున్నారు వాళ్లు. అంటే రాజకీయంగా బాబును దెబ్బ తీసేందుకు, ఓ కులం ముద్ర కొట్టి రాష్ట్రాన్ని రగిల్చి దృష్టి మళ్లించేందుకు వేసిన ఎత్తుగడ ఈ రాజధాని తరలింపు. జనం ఇలాగే కొట్టుకు ఛస్తారు. ఏం చేసినా ఏం చేయకపోయినా అడిగే నాధుడు లేడు. అందుకే కమిటీల మీద కమిటీలు. హైపవర్ కమిటీకి కాల పరిమితి లేదు అనే కొనసాగింపులు కూడా పెడుతున్నాడు. ఈ విషయాన్ని వైసీపీ వ్యూహ బృందంలో కీలక సభ్యుడు మంత్రులతో నేరుగా చెప్పాడు మధ్యాహ్నం.
అంటే ఇది కేవలం రాజకీయం. అడ్డగోలు రాజకీయం. సెల్ఫ్ గోల్ రాజకీయం. రాష్ట్రాన్ని రోడ్డు మీదకి లాగేసి, అన్ని రకాలుగా దెబ్బేసి, పబ్బం గడుపుకొనేందుకు - ఏలేద్దాం ఏలేద్దాం అని ఏలిగాడి ఆలోచన చేస్తున్నోడి ఎత్తుగడ ఇది. అందుకే అమరావతి పోరాటాన్ని రక్షించుకోవడం రాష్ట్రం బాధ్యత, ఇదేం రాజకీయ స్లోగన్ కాదు. నిజం. ఇష్టం ఉన్నా లేకపోయినా ఇంతే ! ఎందుకంటే రేపు రాష్ట్రాన్ని గాడిన పెట్టి కాపాడాల్సింది పవర్ హౌస్ లాంటి రాజధానే !