జగన్ మోహన్ రెడ్డి బయటకు రావటమే ఎక్కువ. ఆయన బయటకు వస్తున్నారు అంటే, రచ్చ రచ్చ అవుతుంది. ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి, శారదాపీఠంలో జరిగే ఉత్సవాల్లో పాల్గునటానికి విశాఖపట్నం వెళ్ళారు. ఈ రోజు ఉదయం గన్నవరం నుంచి బయలుదేరి, విశాఖ చేరుకున్నారు. జగన్ మోహన్ రెడ్డి విశాఖలో దిగిన దగ్గర నుంచి రచ్చ రచ్చగానే ఉంది. ముందుగా జగన్ వస్తున్నారని, ఆయన వెళ్ళే దారిలో షాపులు అన్నీ మూసివేయటం పెద్ద వివాదాస్పదం అయ్యింది. సియం వస్తుంటే, అసలు మేమెందుకు షాపులు ముయ్యాలి అని ప్రశ్నించినా, వారికి చివరకు షాపులు మూసేయక తప్పలేదు. అంతేనా, ఇంకో వింత ఘటన. జగన్ వెళ్ళే దారిలో రోడ్డు పైన బ్యారికేడ్లు పెట్టారు. ఇలా ఎందుకు పెట్టారో, ఏంటో ఎవరికీ అర్ధం కాలేదు. అసలు ఒక సియం ప్రజల మధ్యకు వస్తే ఎలా ఉండాలి ? ప్రజలతో మమేకం అయ్యేలా ఉండాలి. ప్రజలు ఆపితే వారి కష్టాలు వినాలి, ప్రజలతో మమేకం అవ్వాలి. తమిళనాడు సియాం స్టాలిన్ చేస్తుంది అదే. ఈ రకంగా సెక్యూరిటీ పేరుతో జగన్ వస్తున్నాడని, షాపులు మూసివేయటం, ఎవరూ రోడ్డు మీద ఉండకూడదు, ఎవరూ కనపడకూడదు అంటే ఎలా ? అప్పటికే టిడిపి నాయకులు కొంత మందిని హౌస్ అరెస్ట్ కూడా చేసారు. మళ్ళీ ఈ ఏర్పాట్లు అదనం.
సరే ఇది అయిపొయింది, జగన్ తో పాటు శారదాపీఠంలోకి వెళ్ళటానికి, మంత్రి అప్పల రాజు, తన అనుచరగళంతో వచ్చారు. మిమ్మల్ని ఒక్కరినే లోపలకు పంపిస్తాం అని చెప్పటంతో, మంత్రి పోలీసుల పై రెచ్చిపోయారు. పచ్చి బూతులు తిడుతూ, అలాగే ఆ పోలీస్ ని తోసేసి రచ్చ రచ్చ చేసారు. బయటకు మాత్రం, పోలీసులే తనను బూతులు తిట్టారు అంటూ, చెప్పుకొచ్చారు. తీరా చూస్తే,మంత్రి బూతులు విడియో బయటకు వచ్చింది. మంత్రితో పాటు, మంత్రి అనుచరులకు కూడా గౌరవం ఇవ్వాలి అంటే ఎలా ? ఇక తరువాత జగన్ మోహన్ రెడ్డి పర్యటన అయిపొయింది. తిరిగి వచ్చేస్తున్నారని, విశాఖ మొత్తం స్థంబింప చేసారు. ఎయిర్ పోర్ట్ కు వెళ్ళే వారు, తమ ఫ్లైట్ టైం అవుతుంది మహా ప్రభో అని రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేయాల్సిన పరిస్థితి. ట్రాఫిక్ పోలీసులతో ఇబ్బందులు, ఇలా రకరకాలుగా జరిగింది. మొత్తానికి గంట పైనే ట్రాఫిక్ ఆపేసారు. ఇలా ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి విశాఖ పర్యటన, రచ్చ రచ్చ అయ్యింది.