ప్రమాణస్వీకారం స్పీచ్ లో నే జగన్ తన కక్ష సాధింపు ధోరణి బయట పెట్టారు. సహజంగా ఇలాంటి వేదికల పై, ప్రత్యర్ధులకు వార్నింగ్ లు ఇచ్చే సంస్కృతీ ఉండదు. అదీ కూడా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, మరో రాష్ట్ర ప్రతిపక్ష నేత, జాతీయ మీడియా సమక్షంలోనే జగన్ వార్నింగ్ లు ఇవ్వటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లు మా పై నెగటివ్ వార్తలు రాస్తే చూస్తూ కూర్చోను అంటూ వార్నింగ్ ఇచ్చారు జగన్. ‘మన కర్మ ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ఉన్న మీడియా. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వాళ్లకు ముఖ్యమంత్రిగా ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే ఇంపుగా కనిపిస్తారు. మిగిలిన ఎవ్వరూ వాళ్లకు ఇంపుగా కనిపించరు. మిగిలినవాళ్లను ఎప్పుడెప్పుడు దింపాలి అంటూ వాళ్ల రాతలుంటాయి. వాళ్లందరికీ ఇదే చెబుతున్నా.. మా ప్రభుత్వం దురుద్దేశంతో వార్తలు రాస్తే పరువునష్టం దావా వేస్తాం. హైకోర్టు జడ్జ్ దగ్గరకు వెళ్లి వీళ్లను శిక్షించండి అని గట్టిగా అడుగుతాం’ అని వైఎస్ జగన్ తన ప్రతికూల మీడియాను హెచ్చరించారు.

jagan 30052019

ఏపీలో అవినీతిని రూపుమాపేందుకు రేపు లేదా ఎల్లుండి తాను ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలుస్తానని సీఎం జగన్ తెలిపారు. ఓ హైకోర్టు జడ్జీని జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటుకు కేటాయించాల్సిందిగా కోరతామని వెల్లడించారు. హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ‘ఏ కాంట్రాక్టు అయినా టెండర్లకు పోకముందే కమిషన్ ముందుకు పంపిస్తాం. జడ్జిగారు చేసే సూచనలు, మార్పులను తు.చ తప్పకుండా పాటిస్తాం. ఆ తర్వాతే కాంట్రాక్టులను పిలుస్తాం. అవినీతి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం’ అని చెప్పారు. మానిఫెస్టోలో పేర్కొన్న నవరత్నాలన్నింటినీ తూచాతప్పకుండా అన్నింటినీ అమలు చేస్తామని జగన్ మరోసారి ప్రజలకు హామీ ఇచ్చారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read