ఏపీ పాలిటిక్స్‌లో వేలు పెడతాం, ముక్కు పెడతాం అంటూ హడావిడి చేస్తున్న కేసీఆర్ ఎంట్రీ కోసం, జగన్ మోహన్ రెడ్డి తపించిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వద్దు అని చెప్పిన కేసీఆర్ ని, ఎలా సమర్ధిస్తారు అంటూ చంద్రబాబు ప్రశ్నిస్తే, జగన్ దానికి సమాధానం చెప్తూ, కేసీఆర్ ను వెనకేసుకుని వస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్న జగన్‌ ఆదివారం నరసన్నపేటలోని బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా, ఆంధ్రా ప్రజలను కుక్కలతో, రాక్షసులతో పోల్చిన కేసీఆర్ గెలుపుని, ఏపిలో సంబరాలు చేస్తుకుంటున్నారని, చంద్రబాబు చేసిన వ్యాఖల పై జగన్ స్పందించారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల అనంతరం ఆంధ్రప్రదేశ్‌లోనూ తాము పర్యటిస్తామని టీఆర్‌ఎస్‌ ప్రకటించడంతో చంద్రబాబు ఉలిక్కిపడ్డారని, అందుకే ప్రత్యేకహోదాను వ్యతిరేకించిన టీఆర్‌ఎస్‌ ఏపీలోకి రావడం ఏంటని వంక పెట్టారన్నారు.

jagankcr 17122018 2

చంద్రబాబు అడిగిన దానికి సమాధానం ఇవ్వకుండా, కేసీఆర్ అంటే భయపడుతున్నాడు అంటూ జగన్ చెప్పుకొచ్చాడు. తెలంగాణా ఎన్నికల్లో కనీసం మాట కూడా మాట్లాడని జగన్, అక్కడకు వెళ్లి కేసీఆర్ తో పోరాడిన చంద్రబాబుని భయపడుతున్నాడు అంటే కామెడీగా ఉంది. ఏపికి అన్యాయం చేసిన నరేంద్ర మోడీ, ఏపి ప్రజలను కుక్కలు అంటున్న కేసీఆర్ తో కలిసి, జగన్ మోహన్ రెడ్డి ఏపిలో ఏమి చేస్తారో కాని, ప్రజలకు మాత్రం వేరే భావం ఉంది. కేసీఆర్ కు తోడుగా, మేము వేలు పెడతాం.. జగన్ తో కలిసి ఏపి రాజకీయాల్లో వేలు పెడతాం అంటున్నడు ఒవైసీ.. ఏపీకి వెళ్లి జగన్‌కు మద్దతిస్తానని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ కూడా అన్నారు. కేసీఆర్, జగన్, నేను కలిసి చంద్రబాబుకు చుక్కలు చూపిస్తాం అంటున్నారు.

jagankcr 17122018 3

ఆంద్రాలో వేలు పెడతాం అనే పోటుగాళ్ళు అందరూ, ఇప్పుడు రండి, వేలు కాలు పెట్టి, మా రాష్ట్ర ప్రజలను తుఫాను నుంచి ఆదుకోండి. సహాయక చర్యల్లో పాల్గుని ప్రజల మన్ననలు పొందండి. కష్టకాలంలో ఉన్నప్పుడు ఒక్కడు రాడు, కాని రాజకీయం చెయ్యటానికి, రాష్ట్రాన్ని నాశనం చెయ్యటానికి మాత్రం అందరూ వేలు పెడతారు, కాళ్ళు పెడతారు. పక్క రాష్ట్రంలో నివాసం ఉంటూ, ఇక్కడ రాజకీయలు చేస్తున్న జగన్, పవన్ కు, ఆంధ్రా మీద ప్రేమ ఉంటుంది అనే నమ్మే వారికి ఉండాలి. అక్కడ ఆస్థులు, నివాసాలు ఉంచుకుని, అవి కాపాడుకుంటానికి, పెన్ డ్రైవ్ లు, చేసిన స్కాంలు బయట పడకుండా ఉండటానికి, అక్కడ ప్రభుత్వాలకు భజన చేస్తూ, ఏపిని నాశనం చేసి, తెలంగాణాకు లబ్ది చేకూర్చాలని చూస్తారు కాని, వీళ్ళకు ఏపి అభివృద్ధి చెందుతుంది అంటే ఏడుపేగా ఉండేది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read