బీజేపీతో టీడీపీ కటీఫ్‌ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి నవ్యాంధ్రకు వస్తున్నారు. ఆదివారం ఉదయం 11.15 గంటలకు గుంటూరులోని ఏటుకూరు బైపాస్‌లో పలు ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. వాటి శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత... అక్కడికి సమీపంలోనే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శిలాఫలకాల ఆవిష్కరణ వరకు బాగానే ఉన్నా... మోదీ బహిరంగ సభ రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని ఉత్కంఠకు గురిచేస్తోంది. సభకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందోనన్న ఆందోళన నెలకొంది. మొన్నటికి మొన్న శ్రీకాకుళం జిల్లా పలాసలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా బహిరంగ సభ ‘ఫ్లాప్‌’ అయ్యింది. బీజేపీ నేతలు మూడువేల కుర్చీలు వేశారుకానీ, మూడొందల మందిని కూడా సమీకరించలేకపోయారు.

modi jagan 0902019

దీంతో అమిత్‌ షా సభా వేదిక కూడా ఎక్కకుండా... బస్సుపై నుంచే ప్రసంగించి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో... మోదీ సభకు జన సమీకరణ చేయడంపై బీజేపీ నేతలు తర్జనభర్జన పడుతున్నట్లు తెలిసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జనాన్ని సమీకరించటం అంత సులువు కాదనే ఆందోళన ఆ పార్టీ నేతల్లో నెలకొంది. ‘ఏది ఏమైనా, ఎలాగైనా’ మైదానం నిండాలని... దీనికోసం టీడీపీ వ్యతిరేక పక్షమైన వైసీపీ సహాయం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఢిల్లీ స్థాయిలో బీజేపీ నేతలతో సన్నిహిత సంబంధాలున్న ఇద్దరు వైసీపీ కీలక నేతలకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. బీజేపీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిత్యం విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రానికి అన్యాయం చేసిన మోదీపై పోరాడాలని ఆయన పిలుపునిస్తున్నారు. ఒకవేళ ప్రధాని సభకు ప్రజాదరణ కరువైతే... చంద్రబాబు వాదనకు బలం చేకూరినట్లవుతుందని, దీనికోసమైనా బీజేపీ సభకు సహకరించాలని వైసీపీకి చెందిన ఇతర ముఖ్య నేతలు నిర్ణయించుకున్నట్లు సమాచారం!

modi jagan 0902019

బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో సంబంధాలున్న గుంటూరు నగర వైసీపీ యువనేత ఒకరు తన అనుచర గణాన్ని ఈ సభకు తరలించే సన్నాహాల్లో ఉన్నట్లు తెలిసింది. మరోవైపు... ప్రధాని సభకు టీడీపీ అనేక రకాలుగా అడ్డంకులు సృష్టిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపిస్తున్నారు. తనకు వ్యక్తిగతంగా జనబలం ఉన్న పెదకూరపాడు, గుంటూరు, సత్తెనపల్లి నియోజకవర్గాల నుంచి సరిగ్గా ప్రధాని సభ జరిగే రోజునే వందలాది బస్సుల్లో జనాన్ని పోలవరం సందర్శనకు తీసుకెళుతున్నారని తెలిపారు. ఆదివారం భారీ ఎత్తున శుభకార్యాలు ఉండటం కూడా జన సమీకరణకు కొంత అడ్డంకిగా ఉందని కూడా ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇక... ప్రధాని పర్యటనకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్నపాటి అపశ్రుతులు, ఎలాంటి ఆందోళనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read