ఈ రోజు జరిగిన పార్లమెంట్ సమావేశంలో కేంద్రమంత్రి నిరంజన్ జ్యోతి ఏపి ప్రభుత్వ పనితీరుని ఎండగట్టారు. ఆయన మాట్లాడుతూ గత మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్ నిర్మించింది కేవలం 5 వేల ఇళ్లు మాత్రమేనని కేంద్రం మంత్రి స్పష్టం చేసారు. 2019 నుంచి వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పీఎంఏవై పథకం కింద ఏపీలో 5 ఇళ్లు మాత్రమే నిర్మించారని కేంద్ర మంత్రి స్పష్టం చేసారు. ఆంధ్రప్రదేశ్ కి 2016 నుంచి 1,82,632 ఇళ్లను కేటాయించామని కేంద్రం చెప్పింది. అంతకు ముందు 2016 టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ఏపీలో 46,726 ఇళ్ల నిర్మాణం జరిగిందని కేంద్రం తేల్చి చెప్పేసింది. కాని గత మూడేళ్లలో వైసిపి ప్రభుత్వం కేవలం 5 ఇళ్లు మాత్రమే నిర్మించారని, మిగతా 46,721 ఇళ్లు టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించినవేనన్న కేంద్రమంత్రి నిరంజన్జ్యోతి లోకసభ సాక్షిగా తేల్చి చెప్పారు.
Advertisements