ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్‌కీ, కౌంటింగ్‌కీ మధ్య 43 రోజులు తేడా ఉండటంతో రకరకాల ఊహాగానాలకి ఆస్కారమేర్పడింది. గ్రామాలు, పట్టణాలు, తాజాగా పోలింగ్‌ బూత్‌ల వారీగా కూడా విశ్లేషణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పందేలు జోరుగా కాస్తున్నారు. కోస్తాలో ఈ గోల మరింత ఎక్కువగా ఉంది. సామాన్యులు మొదలుకుని ఉన్నతాధికారుల వరకు అందరూ తమకు తోచిన విధంగా విశ్లేషణలు చేస్తున్నారు. ఓటింగ్ పెరిగినందుకు కారణాలు ఏమై ఉంటాయనే అంశమే అందరి మెదళ్లకు పదునుపెడుతోంది. 2014 ఎన్నికల కంటే 2019 ఎన్నికల్లో సుమారు 14 లక్షల మంది మహిళలు అదనంగా ఓట్లేయటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇది తమకు అనుకూలంగా జరిగిన ఓటింగ్ అని తెలుగుదేశం పార్టీ చెబుతుండగా, చంద్రబాబుకు వ్యతిరేకంగానే ఈ ఓటింగ్ జరిగిందని వైసీపీ నేతలు వాదిస్తున్నారు.

game 27032019

అయితే అధికారవర్గాల్లో మాత్రం మరోరకమైన చర్చ సాగుతోంది. "వామ్మో! జగన్ బ్యాచ్ పట్టణాలు, నగరాల్లో అత్యధికంగా ఉంది'' అని సెక్రటేరియట్‌లోని కొందరు అధికారులు బాహాటంగా మాట్లాడుకుంటున్నారు. "జగన్ అధికారంలోకి వస్తే ఆయన అనుచరవర్గం పట్టణాలు, నగరాల్లో విజృంభిస్తుంది. అందరినీ భయబ్రాంతులకు గురిచేస్తుంది. అరాచకాలు పెరుగుతాయంటూ ప్రజల్లో ఓ భావన ఏర్పడింది. అందుకే వారంతా జగన్‌కు వ్యతిరేకంగా ఓటేశారు'' అన్నది ఆయా అధికారుల తాజా విశ్లేషణ. ఏపీ ఎన్నికల్లో పోలింగ్‌ బూత్‌లలో బారులుతీరిన వారంతా తటస్థులనీ, ఏ ఎన్నికల్లో అయినా తటస్థులు ఎటు మోగ్గితే అటే ఫలితం ఉంటుందనీ అధికారులు చెబుతున్నారు. "ఏ పార్టీకి ఉండే ఓట్లు ఆ పార్టీకి ఉంటాయి. కానీ తటస్థులే ఫలితాన్ని డిసైడ్ చేస్తారు'' అన్నది వారి వాదనలో ప్రధాన లాజిక్కు!

game 27032019

జగన్‌ బ్యాచ్‌ ఎక్కడికక్కడ కాచుకుని ఉందన్న భయంతోనే తటస్థులు తమవైపు వైపు మొగ్గారని తెలుగుదేశం నేతలు కూడా చెబుతున్నారు. ఎన్నికల ముందు వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరగడం, దానిపై పెద్దఎత్తున రాద్ధాంతం జరగడంతోపాటు ఈ హత్యకు చంద్రబాబే కారణమని జగన్ ఆరోపించారు. దీనిపై చంద్రబాబు కూడా ప్రతిస్పందించారు. జగన్‌ మనుషులే వివేకాను హత్యచేశారని బాబు వ్యాఖ్యానించారు. చివరికి ఈ వ్యవహారంపై సంయమనం పాటించాల్సిందిగా హైకోర్టు ఇరువురిని కోరింది. అప్పటికి బహిరంగ విమర్శలు తగ్గినప్పటికీ.. వివేకా హత్య ప్రభావం జగన్‌ బ్యాచ్‌పైనే ఎక్కువ ఉందని సెక్రటేరియట్‌లోని కొంతమంది అధికారులు విశ్లేషించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ బ్యాచ్ లేదు గానీ, పట్టణాలు, నగరాల్లో ఓటువేసిన వారంతా ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నారని అధికారవర్గాలు మాట్లాడుకుంటున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read