ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అటు బీజేపీ, ఇటు వైసిపీ పై మాటల దాడి తీవ్రతరం చేసారు... ముఖ్యంగా జగన్ ఆడుతున్న నాటకాల పై మండిపడ్డారు... తన నివాసంలోని ప్రజా దర్బారు హాల్లో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించిన చంద్రబాబు పలు కీలక అంశాలను నేతలతో ప్రస్తావించారు... రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అభివృద్ధి కాకూడదనేదే జగన్నాటకం వెనకున్న అసలైన కారణమని ఆయన మండిపడ్డారు... జగన్ చేస్తున్న పనులు చుస్తే అది స్పష్టం అవుతుంది అని అన్నారు... పట్టిసీమ దగ్గర నుంచి, అమరావతి దాకా జగన్ వైఖరి ఇదే చెప్తుంది అని అన్నారు.. ఇప్పటికీ కేంద్రాన్ని ఒక్క మాట కూడా, అనకుండా, ఎన్ని నాటకాలు వేస్తున్నాడో ప్రజలు చూస్తున్నారని చంద్రబాబు అన్నారు...

cbn 20022018 2

రాష్ట్ర విభజనతో చాలా నష్టపోయాం, ఆదుకోవాలని కేంద్రాన్ని కోరామని సీఎం తెలిపారు. నాటి ప్రధాని ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని కోరుతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఇతర రాష్ట్రాలకు అధిక నిధులు ఇచ్చి మనకు ఇవ్వకపోతే ఎలా ఒప్పుకుంటాం? అంటూ ఒకింత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులంతా విభజన చట్టాన్ని, బడ్జెట్‌ను క్షుణ్ణంగా పరిశీలించాలని సీఎం సూచించారు... విభజన హామీల పట్ల ఆయా పార్టీల అజెండా ఎలా ఉన్నా.... మనం మాత్రం ప్రజల మనోభావాలకు అనుగుణంగా వెళ్దామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన అజెండా అన్న ఆయన.... వైకాపా రోజుకో మాట మాట్లాడుతోందని దుయ్యబట్టారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టగానే బాగుంది అని తొలుత పొగిడింది వైకాపానేనని గుర్తుచేశారు...

cbn 20022018 3

రాష్ట్రానికి ఎలాగైనా న్యాయం జరగకూడదనే దుర్భుద్దితోనే జగన్ రాజీనామాల నాటకం ఆడుతున్నాడని ఆక్షేపించారు. అవి ఇచ్చాం.. ఇవి ఇచ్చాం అంటూ ఈ మధ్య భాజపా కూడా ప్రకటనలు చేస్తోందని.. భాజపా నేతలు దిల్లీకి వెళ్లి రాష్ట్రానికి కావాల్సినవి అడగకుండా తెలుగుదేశాన్ని ప్రశ్నించమేమిటని తప్పుబట్టారు. అన్యాయాన్ని సరిదిద్దాలన్నది 5కోట్ల మంది ప్రజల డిమాండని చంద్రబాబు తేల్చి చెప్పారు. మూడేళ్లుగా కేంద్రం నుంచి అంతగా సాయం అందకపోయినా ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి చేశామన్నారు. మనం కష్టపడుతున్నాం కదా అని సాయం చేయమని కేంద్రం భావిస్తే కుదరదని..., మనకు జరిగిన అన్యాయానికి న్యాయం జరిగే వరకూ పోరాడాల్సిందేనని దిశానిర్దేశం చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read