ప్యారడైజ్ పేపర్స్ బయట పెట్టింది ఒక ఇంటర్నేషనల్ నిఘా సంస్థ... దాంట్లో మనోడి పేరు ఉంది... సహజంగా ప్రపంచంలో ఏ దరిద్రం అయినా, మనోడి పేరు ఉండాల్సిందే... అవే అన్ని పేపర్లు రాశాయి... దానికి మనోడు చంద్రబాబుకి 15 రోజులు ఛాలెంజ్ అన్నాడు... కట్ చేస్తే, ప్యారడైజ్ పేపర్స్ వాళ్ళు 15 గంటల్లో ఈయనగారి భాగోతం బయట పెట్టారు... రస్ ఆల్ ఖైమా, నిమ్మగడ్డ ప్రసాద్, జగన్... వీళ్ళ ముగ్గురూ కలిసి, ఏమి చేసేంది ప్యారడైజ్ పేపర్స్ స్పష్టంగా బయట పెట్టింది... యూఏఈ కి చెందిన, రస్ ఆల్ ఖైమాకు వాడరేవు, నిజాంపట్నం పోర్టులను అభివృద్ధి చెయ్యటానికి వైఎస్ ఒప్పుకున్నారు... దీని వెనుక నీకిది నాకది, నడిచింది... వైఎస్ చేసిన సేవకు, రస్ ఆల్ ఖైమా ఎలా ఋణం తీర్చుకోవాలి అని ఆలోచిస్తూ ఉండగా, నిమ్మగడ్డ ప్రసాద్ తగిలాడు... ఈ ప్రాజెక్టు పనులను నిమ్మగడ్డ ప్రసాద్ కంపెనీల భాగస్వామ్యంతో చేపట్టేలా రస్ ఆల్ ఖైమా ఒప్పందం కుదర్చుకుంది.

రస్ ఆల్ ఖైమా సంస్థ మారిష్‌సలో కొన్ని అల్లిబిల్లి కంపెనీలు స్థాపించి, వాటికి దాదాపు 714.78 కోట్లు బదలాయించింది. ఆ అల్లిబిల్లి కంపెనీల నుంచి, నిమ్మగడ్డ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. నవంబరు 2008-జూన్ 2009 మధ్య మారిషస్ కంపెనీల నుంచి నిమ్మగడ్డకు చెందిన వాన్‌పిక్ షిప్‌యార్డ్ ప్రైవేట్ లిమిటెడ్, వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, జెనిక్స్ ఎన్‌పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే 3 కంపెనీలకు రూ.462.98 కోట్లు విలువైన, లక్షలాది షేర్లు బదలాయింపు జరిగింది. తరువాత, నిమ్మగడ్డ ఆ డబ్బులు, జగన్ కంపనీల్లోకి మళ్ళించాడు... మారిష్‌సలో రస్ ఆల్ ఖైమా కంపెనీల ద్వారా వచ్చిన నిధులతోనే వాన్‌పిక్ పోర్టుల అభివృద్ధికి నిమ్మగడ్డ శ్రీకారం చుట్టారు. వైఎస్ సీఎంగా ఉండగా 22 వేల ఎకరాల భూమిని వాన్‌పిక్‌కు అక్రమంగా కట్టబెట్టినట్లు సీబీఐ తేల్చింది. ఇవి ఎంత అక్రమంగా కొట్టేసారో, అందరికీ తెలిసిందే...
ఈ భూములు ఇచ్చినందుకు ‘కృతజ్ఞత’గా నిమ్మగడ్డ ప్రసాద్ క్విడ్ ప్రో కో పద్ధతిలో జగన్‌కు చెందిన కంపెనీల్లో రూ.854 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు సిబిఐ తేల్చిన సంగతి తెలిసిందే. జగన్ అవినీతిపై సీబీఐ దాఖలు చేసిన 11 చార్జీషీట్లలో నిమ్మగడ్డ ప్రసాద్ పేరు ఉంది. ఈ కేసులోనే గత ఏడాది జార్జియాకు సంబంధించిన ఓ ప్రాజెక్టులో 150 కోట్ల డాలర్ల అక్రమాలకు బాధ్యుడిగా రస్ ఆల్ ఖైమా సీఈవో ఖతర్ మసాద్‌ను జెడ్డా విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఇవన్నీ సిబిఐ, ఆంధ్రజ్యోతి, ఈనాడు, లేక తెలుగుదేశం పార్టీ బయట పెట్టలేదు... 714 మంది డెకాయట్, 420 గాళ్ళ వివరాలు, దాదాపు 180 దేశాలకు సంబంధించి, 13.4 పత్రాలు సంపాదించి, వాటిని ఇన్వెస్టిగేషన్ చేసి, "The International Consortium of Investigative Journalists" అనే ఇంటర్నేషనల్ నిఘా సంస్థ "ప్యారడైజ్ పేపర్స్" పేరుతో గుట్టు రట్టు చేసేంది... మరి జగన్ మోహన్ రెడ్డి గారు, ప్రజలను మభ్య పెట్టటం ఆపి, వీటి మీద సమాధానం చెప్పండి... "ప్యారడైజ్ పేపర్స్"లో పేరు ఉన్న అందరూ (ప్రపంచ వ్యాప్తంగా) స్పందించారు... మీరు తప్ప...