ఎప్పుడూ హాట్ హాట్ గా ఉండే ఆంధ్రప్రదేశ్ రాజకీయలు, ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ తో కూల్ గా ఉన్నాయి... ప్రతి పక్ష నేత జగన్ మోహన్ రెడ్డి 45వ పుట్టిన రోజుని పురస్కరించుకుని ఇవాళ చంద్రబాబు, జగన్ కి ట్విట్టర్ ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.. సంతోషంగా, ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షిస్తూ సీఎం చంద్రబాబు ట్విట్టర్‌లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.. అయితే దీనికి కూడా జగన్, వెటకారంగా రిప్లై ఇచ్చారు.... చంద్రబాబు ట్వీట్ ని రీ ట్వీట్ చేస్తూ, ‘సంభ్రమాశ్చర్యానికి లోనయ్యానండీ. ధన్యవాదాలు’ అని జగన్ ట్వీట్ చేశారు.
అసలు దీంట్లో ఆశ్చర్యపోవాల్సింది ఏమి ఉందో జగన్ కే తెలియాలి... నిజానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ట్విట్టర్ ద్వారా అనేక సందర్భాల్లో చాలా మందికి విషెస్ చెప్పారు... ప్రధాన మంత్రి దగ్గర నుంచి, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, పార్టీ ముఖ్యులు ఇలా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటారు... పండగలప్పుడు కూడా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతారు.... పోయిన ఏడాది, ఏకంగా అందరూ టీవీలో లైవ్ చూస్తూ ఉండగా, అసెంబ్లీ సమావేశాలు జారుతూ ఉండగా, జగన్ పుట్టిన రోజు పురస్కరించుకుని, చంద్రబాబు విషెస్ చెప్పారు... చంద్రబాబు స్వయంగా జగన్ సీట్ దగ్గరకు వెళ్లి విషెస్ చెప్పారు...
జగన్ గారికి 45 ఏళ్ళు వచ్చాయి కదా, బహుసా, మతి మరుపుతో ఈ విషయం మర్చిపోయి ఉంటారు... అందుకే చంద్రబాబు విషెస్ చెప్పగానే, ఆశ్చర్యపోయారు... నిజానికి ఆశ్చర్యపోవాల్సింది చంద్రబాబు ట్వీట్ కి కాదు, జగన్ ఇచ్చిన రిప్లై కి... జగన్ ఏ నాడు అన్నా, ఆయన నోటితో, ఎవర్ని అన్నా సరే "అండి" అనటం విన్నామా ? ఇది ఆశ్చర్యం అంటే... కాలుస్తా, చెప్పుతో కొడతా, చీపురుతో కొడతా, ఉరి వేస్తా అంటూ, ఆడు, ఈడు అని మాట్లాడే జగన్, ఒకే సారి ఇలా "అండి" అని పిలిచే సరికి ప్రజలు ఆశ్చర్యపోయారు... మా ఆశ్చర్యాన్ని ఇలాగే ఉంచుతూ, రేపటి నుంచి కూడా ఇలాగే గౌరవప్రదంగా రాజకీయాలు చెయ్యాలని జగన్ గారికి మనవి...