ఎప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నా, సర్వేలు రావటం అనేది సహజం. అయితే మన రాష్ట్రంలో మాత్రం, జగన్ మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి, అనూహ్యంగా, జాతీయ మీడియాలో కూడా, మన రాష్ట్రం గురించి సర్వేలు వెయ్యటం ప్రారంభం అయ్యాయి. ఇలాంటివి ఇది వరకు ఎన్నికలప్పుడు మాత్రమే జాతీయ మీడియా వేసిది. అయితే జగన్ మాత్రం, తనకు తెలిసిన విద్యలతో, జాతీయ మీడియాతో టై అప్ అయ్యి, సంవత్సరం ముందు నుంచి హడావిడి చేస్తూ, జగన్ గెలిచిపోతున్నాడు అంటూ ఆ సర్వేలు వేయించుకుంటాడు. అదే తీసుకవచ్చి, తన పేపర్ లో మెయిన్ హెడ్డింగ్ గా వేసుకుని, తాను ఆనంద పడుతూ, తన అభిమనాలుని ఆనంద పరుస్తాడు.

survey 15092018 2

ఈ కోవలోనే, నిన్న ఒక సర్వే వచ్చింది. అందులో, జగన్ గెలిచిపోతున్నాడు, చంద్రబాబు ఓడిపోతున్నాడు అంటూ, ఆ సర్వే ఊదరగొట్టింది. ఇక ఇది చూసుకుని, జగన్ మోహన్ రెడ్డి ఎక్కడా ఆగటం లేదు. అయితే, ఈ సర్వే ఫాల్స్ అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే, ఇది వరకు కూడా ఇలాంటే సర్వేలే వచ్చాయి. తీరా ఎన్నికలు ఆయిత తరువాత, జగన్ ఓడిపోవటం అనేది కామన్. జగన్ ఏమో సర్వేల్లో గెలుస్తాడు, చంద్రబాబు ఏమో, ప్రజల్లో గెలుస్తాడు, ఇదే జరుగుతూ వస్తుంది. కావాలంటే, అప్పట్లో జగన్ గెలుస్తాడు అంటూ చెప్పిన సర్వే లు చూడండి.. ఇలా ప్రజలను ప్రభావితం చెయ్యటానికి, జగన్, అమిత్ షా పడుతున్న తిప్పలు ఇవి.

survey 15092018 3

దీని పై తెలుగుదేశం కూడా స్పందించింది... కేంద్ర ప్రభుత్వం ఛానెల్స్ ద్వారా తప్పుడు సర్వేలు చేయిస్తోందని ఏపీ ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు అన్నారు. ఒకే సంస్థ రెండు నెలల వ్యవధిలో రెండు రకాలుగా తప్పుడు సర్వే ఫలితాలను విడుదల చేసిందని విమర్శించారు. ఇదే యాక్సిస్ సంస్థ కర్ణాటకలో సర్వే చేస్తే ఎలాంటి ఫలితాలు వచ్చాయో ప్రజలందరికీ తెలుసన్నారు. ఇదే సంస్థ గత జూలై లో నిర్వహించిన సర్వేలో 45శాతం మంది ఓటర్లు చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నారని ఇచ్చిందని గుర్తు చేశారు. అంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 104 పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. కేంద్రం ప్రోద్బలంతో కేసుల భయమంటూ తెదేపాపై కేవీపీ ఆరోపణలు చేస్తున్నారని కుటుంబరావు అగ్రహం వ్యక్తం చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read