మా వంశం ఏంటో తెలుసా... మా తాత రాజా రెడ్డి చరిత్ర తెలుసా... మా నాన్న రాజశేఖర్ రెడ్డి చరిత్ర తెలుసా... నా చరిత్ర తెలుసా... మాట ఇస్తే, మడం తిప్పని మహా వంశం మాది... మాట మార్చటం అంటే మాకు తెలియదు... అబద్ధాలు ఆడటం రాదు... అవినీతి అంటే ఏంటో తెలియదు... ఇది జగన్ మోహన్ రెడ్డి, ఊరు ఊరు నడుస్తూ, చెప్తున్న మాటలు... నిజమేనేమో, ఈయనకు ఇంత ధైర్యం ఉందేమో, ఇతను ఇంత గొప్ప క్యారక్టర్ ఉన్నోడేమో, దమ్ము ఉన్నోడేమో అనుకుని, పాపం రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన పవన్ కళ్యాణ్, ఈ మడమ తిప్పని మహా నేత సవాల్ స్వీకరించి, మీకు నా మద్దతు అన్నారు... అయితే, 24 గంటలు దాటినా, పవన్ సవాల్ కు, మడమ తిప్పని మహా నేత ఎక్కడా స్పందించలేదు... ఎందుకో మరి...
రెండు రోజుల క్రితం జగన్ మాట్లాడుతూ "చంద్రబాబు పార్టనర్ పవన్ కళ్యాణ్ కేంద్రం పై అవిశ్వాస తీర్మానం పెట్టండి అని అన్నాడు. కానీ అవిశ్వాస తీర్మానాన్ని తీసుకోవడానికి 54 మంది సభ్యుల సంతకాలు కావాలి. అంత బలం వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు లేదు, పవన్ కళ్యాణ్ గారూ.. మిమ్మలి ఒక్కటే కోరుతున్నా.. మీ పార్టనర్ చేత ఆ మద్దతు ఇప్పించండి అని సవాలు విసిరారు..." దీనికి పవన్ స్పందించారు... "ఒక్క ఎంపీతో నైనా అవిశ్వాస తీర్మానం పెట్టొచ్చు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు కావాలన్నారు.. మీకు కావాల్సిన మద్దతు నేనిస్తాను. మార్చి 4వ తేదీన నేను ఢిల్లీకి వస్తాను. అందరు ఎంపీల మద్దతు కూడగడతాను. ముందు జగన్ అవిశ్వాస తీర్మానం పెట్టాలి" అని పవన్ కల్యాణ్ తేల్చిచెప్పారు...
మీరు దేనికీ భయపడొద్దు, మీరు ధైర్యవంతుడు, దమ్ము ఉన్నవాడు అంటూ వెటకారంగా జగన్ ను అని, మీరు భయపడవద్దు, మీకు అండగా నేను ఉంటాను, అఖిలపక్షం అండగా ఉంటుంది, కాని మీరు మొదటి రోజే కేంద్రం పై అవిస్వాసం నోటీసు ఇవ్వమని ఛాలెంజ్ చేసారు... దీని పై 24 గంటలు గడిచినా, జగన్ మాత్రం అడ్రస్ లేడు... నిన్న అంబటి మాత్రం మాట్లాడుతూ, "ఎబ్బే, మా జగన్ ఎక్కడ సవాల్ చేసాడు" అంటూ పవన్ పై చిందులు తొక్కాడు అంబటి... నిజానికి అవిశ్వాస తీర్మానం ఇవ్వాలి అంటే, రెండు వారల ముందు ఇవ్వాలి అనే నిబంధన ఉంది... జగన్ కనుక పార్లమెంట్ అయిపోయే సమయంలో ఇస్తే, అది ఎందుకు పనికిరాదు... అందుకే పవన్, ఇప్పుడే అవిశ్వాస తీర్మానం పెట్టండి, మీ సవాలు స్వీకరించి, మీకు మద్దతు నేను ఇస్తా అని చెప్పారు... వీళ్ళు మాత్రం, పవన్ సవాల్ స్వీకరించకుండా పరారీలో ఉన్నారు... వారి ఇబ్బందులు వారివి పాపం...