రెండు రోజుల క్రితం, కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి ఎప్పటిలాగే అన్యాయం జరిగింది. విభజన చట్టంలో పెట్టిన ఏ హామీ పైనా ప్రస్తావన లేదు. విద్యాసంస్థలకు అరకోర కేటాయింపులతో సరిపెట్టారు. కేంద్ర బడ్జెట్ పై, ప్రతిపక్ష నేత, చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, కేంద్రం పై విమర్శలు గుప్పించారు. ప్రత్యేక హోదా పై, రాజధాని పై ఒక్క మాట కూడా లేకపోవటం పై తీవ్రంగా స్పందించారు. అలాగే విద్యాసంస్థలకు ఇలా తక్కువ కేటాయిస్తే ఎప్పటికి పూర్తవుతాయి అంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్ పై తెలుగుదేశం పార్టీ నేతలు కూడా విమర్శలు గుప్పించారు. మోడీ చూపిస్తున్న వివక్ష పై ప్రశ్నలు గుప్పించారు. అయితే చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నేతలు స్పందించారు కాని, జగన్ మోహన్ రెడ్డి మాత్రం స్పందించలేదు. కేంద్ర బడ్జెట్ పై స్పందించని సియంగా జగన్ గారు ఉన్నారని తెలుగుదేశం నేతలు విమర్శిస్తున్నారు. బడ్జెట్ బాగుంది అనో, బాగోలేదు అనో, ఎదో ఒకటి స్పందించాలి కదా అని తెలుగుదేశం నేతలు విమర్శిస్తున్నారు.

అయితే, మీడియా ముందు జగన్ మోహన్ రెడ్డి మాట్లాడక పోయినా, పార్టీ నేతల వద్ద మాత్రం కేంద్ర బడ్జెట్ పై స్పందించారు. నిన్న తాడేపల్లిలోని ఆయాన నివాసంలో ముఖ్య నేతలతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా, బడ్జెట్ లో కేంద్రం మనకు అన్యాయం చేసిందని, జగన్ దృష్టిగా తేగా, జగన్ దీని పై స్పందించారు. కేంద్రం స్పందించకాపోతే, మళ్ళీ మళ్ళీ అడుగుదాం, పార్లమెంట్ లో అడుగుదాం, అన్ని చోట్లా అడుగుతూనే ఉందాం అని జగన్ చెప్పారు. అయితే, మొదటి సారి మోడీని కలిసిన తరువాత కూడా, జగన్ ఇదే రకమైన వ్యాఖ్యలు చేసారు. సార్, ప్లీజ్ సార్ ప్లీజ అని అడుగుతూ ఉంటానని జగన్ చెప్పిన విషయం తెలిసిందే. దీన్ని బట్టి, జగన్ మోహన్ రెడ్డి, మోడీ పై, కేంద్రం పై, బహిరంగంగా ఏ విమర్శ చెయ్యరు అని అర్ధమవుతుంది. మనకు అన్యాయం జరుగుతున్నా, అడుగుతూనే ఉందాం, ప్లీజ్ సార్ ప్లీజ్ అని అడుగుదాం అనేది జగన్ గారి విధానంగా తెలుస్తుంది. మరి ఇలా అయితే మోడీ గారు, మనల్ని అసలు పట్టించుకుంటారా ? జగన్ గారు , మీ విధానం రాష్ట్రానికి మంచి జరిగితే పరవాలేదు కాని, మన హక్కుల కోసం, ప్లీజ్ ప్లీజ్ అని అడగటం ఎందుకు, ఒకసారి ఆలోచించండి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read