ఒక చిన్న ఆందోళన కూడా లేకుండా, విభజనలో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని కోసం, అమరావతి రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారు. తమ జీవితాలతో పాటు, రాష్ట్రం కూడా బాగుపడుతుందని వారు ఆలోచించారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారటం, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, అమరావతిలో కేవలం అసెంబ్లీ మాత్రమే ఉంటుందని చెప్పటంతో, రాజధాని రైతులు రోడ్డున పడ్డారు. మా జీవితాలు బాగు పడతాయి, ఇక్కడ ఒక పెద్ద సిటీ వస్తుందని భూములు ఇచ్చాము, ఇప్పుడు ఈ ప్రాంతాన్ని ఏమి అభివృద్ధి చెయ్యకుండా, కేవలం అసెంబ్లీ మాత్రమే పెడితే, ఏమి వస్తుంది అంటూ, ఆ రైతులు గత పది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అయితే గత పది రోజుల నుంచి ప్రభుత్వం మాత్రం, వారి ఆందోళన గురించి అసలు స్పందించలేదు. స్పందించక పోగా, అధికార పార్టీ నేతలు, అమరావతి ఎడారి అని, అమరావతిలో లింగు లింగు మంటూ,8 గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తున్నారు అంటూ, హేళనగా మాట్లాడారు.
చివరకు స్థానిక వైసీపీ ఎమ్మెల్యేలు కూడా, వారి గురించి అసలు పట్టించుకోవటం లేదు. ప్రభుత్వం వారి గురించి అసలు పట్టించుకోక పోవటంతో, అక్కడ రైతులు ఆందోళన చెందుతున్నారు. రేపు క్యాబినెట్ భేటీలో, విశాఖ రాజధాని అనేది ఖాయంగా, ప్రభుత్వం ప్రకటన చేసే అవకాసం ఉన్న నేపధ్యంలో, ఇదే సమయంలో అమరావతి రైతుల గురించి కూడా జగన్ ఏదో ఒక ప్రకటన చేస్తారని, అమరావతి రైతులకు ప్యాకేజీ పెంచుతారని వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి మరో ఆలోచన చేస్తున్నారని, అమరావతి రైతుల కోసం ఓ కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కమిటీతో రాజధాని రైతులు, ఇబ్బందులు అన్నీ తీరి పోయి, వారి కష్టాలు లేకుండా చేస్తారని వైసీపీ ప్రచారం చేస్తుంది.
మంత్రులు బుగ్గన, కన్నబాబు, బొత్స, నారాయణస్వామి సభ్యులుగా ఈ కమిటీ ఉంటుందని సమాచారం వస్తుంది. వీరు రైతులతో చర్చించి, వారికి ఎలా న్యాయం చెయ్యాలో ఈ కమిటీ చూస్తుందని సమాచారం. అయితే ఈ వార్త పై రైతులు మాత్రం, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కమిటీలు లాంటివి మాకు అవసరం లేదని, ఇక్కడ నుంచి ఏదీ తరలించటానికి వీలు లేదని, అప్పుడే ఏదైనా కమిటీ అయినా, ఇంకా ఏమైనా వారితో మేము మాట్లాడతాం అని రైతులు అంటున్నారు. ఇప్పటికే జీఎన్ రావు కమిటీతో మా కడుపు కొట్టారని, ప్రతి రోజు మమ్మల్ని హేళన చేస్తున్న, బొత్సా లాంటి వారితో కమిటీ అంటేనే, తమ పై ఈ ప్రభుత్వానికి, ఎలాంటి ఆసక్తి ఉందొ అర్ధమవుతుందని, వాపోతున్నారు.