ఏపీలో ప్రతిపక్షనేత పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. నాలుగుదశాబ్దాలు రాజకీయాల్లో కాకలు తీరిన యోధుడు చంద్రబాబు పట్ల అనపర్తిలో పోలీసులు వ్యవహరించిన తీరు అరాచకానికి పరాకాష్టగా నిలిచింది. జెడ్ ప్లస్ కేటగిరి భద్రతలో ఉన్న చంద్రబాబుని చిమ్మచీకట్లో 8 కిలోమీటర్లు నడిపించిన పోలీసులు, ఆయనకేమైనా జరగాలని కోరుకున్నారా అనే అనుమానాలూ వస్తున్నాయి. అనపర్తి సభకి అనుమతి ఇచ్చిన పోలీసులే సభ ఆరంభం అయ్యేముందు వేదిక మార్చుకోవాలని కోరడం అంతా అనుమానాస్పదమే. ఒక ప్రతిపక్షనేత పట్ల పోలీసులు అలా వ్యవహరిస్తారా? పోలీసుల ముసుగులో అసాంఘికశక్తులా? లేకపోతే ఎన్ ఎస్ జీ భద్రతలో వస్తున్న చంద్రబాబు కాన్వాయ్ కదలకుండా పోలీసుల్ని రోడ్డుపై కూర్చుని అడ్డుపెట్టుకున్న నేర వ్యూహం ఎవరిది? ఆ పోలీసుల్ని లేవమన్నా, లేపినా పోలీసులపై దాడి చేశారని కేసు పెట్టటానికేనన్నది వైసీపీ క్రిమినల్ ప్లాన్ అని ఎవరికైనా ఇట్టే అర్థం అవుతోంది. పోలీసుల బస్సులని చంద్రబాబుకి అడ్డంగా పెట్టారు. అటుగా ట్రాక్టర్ తో వెళుతున్న ఓ రైతుని కొట్టి దింపేసి ట్రాక్టర్‌ని అడ్డంపెట్టారు. బ్యారికేడ్లు అడ్డంపెట్టడం, టిడిపి కార్యకర్తలపై లాఠీచార్జి, చంద్రబాబు నడిచే తోవ..సభ ప్రాంతంలో కరెంట్ తీసేయడం..జనరేటర్లు ఆపేయడం.. షాపులు మూసేయించడం చూస్తుంటే...పోలీసుల్లా మాత్రం కనిపించలేదు. ప్రత్యర్థులపై దాడులు చేసే ఫ్యాక్షన్ ముఠాలని తలపించారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. అనపర్తిలో పోలీసు చర్యలు చూశాక కందుకూరు, గుంటూరు తొక్కిసలాటలు కూడా తెరవెనుక పెద్దలు ప్లాన్ చేసినవేనని అనుమానాలు వస్తున్నాయి. టిడిపి సభపై, కార్యకర్తలపై దాడులకు నేతృత్వం పోలీసులు అధికారులే వహించడం విశేషం. సీఐ శ్రీనివాస్ టిడిపి నేతలు, కార్యకర్తలపై దాడి చేసిన దృశ్యాలు చూసి ప్రజలు అవాక్కయ్యారు. డిఎస్పీ భక్తవత్సలం ఫిర్యాదుపై బిక్కవోలు పీఎస్‍లో టీడీపీ అధినేత చంద్రబాబుపైనే కేసు నమోదు చేయించడం ఇది పెద్దల ఆదేశాలతో జరుగుతున్న కుతంత్రం అని అర్థం అవుతోందని టిడిపి నేతలు అంటున్నారు. అడ్డుకుని ఏం సాధించారు అంటే..చంద్రబాబుని మరింత కరడుగట్టినట్టు చేశారు. మామూలు సభ అయితే తాను చేసిన అభివృద్ధి వివరించి వెళిపోయేవారు చంద్రబాబు. వైసీపీ-పోలీసులు కల్పించిన అడ్డంకులతో ఆవేశంతో కూడిన ప్రసంగంతో కేడర్‌లో నూతనోత్తేజం నింపారు. అరాచక ప్రభుత్వంపై ప్రజాతిరుగుబాటుకి అనపర్తిని సంకేతంగా నిలిపారు బాబు. విపక్షాలన్నీ వైసీపీ ప్రభుత్వం, పోలీసుల తీరుని ముక్తకంఠంతో ఖండించాయి.
చంద్రబాబుని అడ్డుకుని జగన్ ఏం సాధించారు?
Advertisements