ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ రోజు సంచలన తీర్పు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అధికారి గిరిజా శంకర్‍, అలాగే ఐఎఫ్ఎస్ అధికారి చిరంజీవి చౌదరికి వారం రోజులు జైలు శిక్ష విధిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొద్ది సేపటి క్రితం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులు అమలు చేయకపోవటం పై, ఇద్దరి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యావన శాఖకు చెందిన, విలీజ్ హార్టికల్చ్ర్ అసిస్టెంట్ అని కొన్ని పోస్టులు ఉంటాయి. ఈ పోస్టులు కు సంబంధించి 36 మందిని రెగ్యులరైజ్ చేయాలని చెప్పి, వారు గతంలో హైకోర్టుని ఆశ్రయించారు. అయితే దీని పై హైకోర్టు తీర్పు ఇస్తూ, వీరిని రెగ్యులరైజ్ అయినా చేయాలని, లేదా సలక్షన్ ప్రాసెస్ లో వీళ్ళకు ప్రాధాన్యత కల్పించాలి అంటూ ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ ఆదేశాలు అమలు చేయకపోవటంతో, దీని పై హైకోర్టులో విలీజ్ హార్టికల్చ్ర్ అసిస్టెంట్ ఎవరు అయితే ఉన్నారో, వాళ్ళు కోర్టు ధిక్కరణ నేరం కింద, హైకోర్టులో మళ్ళీ పిటీషన్ దాఖలు చేసారు. ఈ కేసుని విచారణకు తీసుకున్న హైకోర్టు, తాము ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని ఇద్దరు అధికారులను కోర్టు ఆదేశించింది. అయితే ఆదేశాలు అమలు చేయకపోగా, ప్రతి వాయిదాకు ఏదో ఒక సాకు చెప్పటం, హైకోర్టు ఆదేశాలు అమలు చేయకపోవటం, ఉత్తర్వులు ఇవ్వకపోవటంతో, ఆగ్రహం వ్యక్తం చేసింది.

hc 22062021 2

అయితే పోయిన వాయిదాలో చిరంజీవి చౌదరి, గిరిజా శంకర్‍లను కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. ఈ రోజు వాళ్ళు కోర్టుకు రావటంతో, ఈ రోజుటికి, మేము ఇచ్చిన ఆదేశాల పై ఏమైనా ఉత్తర్వులు ఇచ్చారా అని ప్రశ్నించింది. అయితే ఉత్తర్వులు ఏమి ఇవ్వలేదని చెప్పటంతో, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు, కోర్టు దిక్కరణ కింద, ఇద్దరికీ వారం రోజులు జైలు శిక్ష విధించింది. వీరి ఇరువురికీ జైలు శిక్ష విధించిన విషయం ప్రభుత్వానికి తెలియటంతో, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తరుపున ప్రభుత్వ ప్లీడర్, జైలుకు పంపవద్దని, శిక్ష విధించవద్దని, తీర్పుని రెండు రోజులు వరకు వాయిదా వేయాలని హైకోర్టుని అభ్యర్దిస్తున్నారు. అయితే కొద్ది నిమిషాల క్రితం వరకు కూడా హైకోర్టు అంగీకరించలేదు. ఇప్పటి వరకు తమ ఉత్తర్వులు అమలు చేయకపోవటంతో, చట్టంలో ఉన్న నిబంధనలు ప్రకారమే, వీరి ఇరువురికీ జైలు శిక్ష విధించామని హైకోర్టు తెలిపింది. ఇప్పుడు వచ్చి ఉత్తర్వులు వెనక్కు తీసుకోమంటే ఎలా అని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజులు తీర్పు వాయిదా వేయమని కోరుతుంది. కోర్టు ఏమి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read