ఆంధ్రప్రదేశ్, పశ్చిమ్‌బంగ ప్రభుత్వాలు సీబీఐని తమ రాష్ట్రాల్లోకి అనుమతించబోమని చెప్పడం పై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్పందించారు. ఎవరికైతే దాచుకునే విషయాలు చాలా ఎక్కువగా ఉంటాయో వాళ్లే సీబీఐకి భయపడతారు అంటూ వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారు. అలాంటి వాళ్లే సీబీఐని తమ రాష్ట్రంలోకి రానివ్వమని అంటారు, అంటూ విమర్శలు చేసారు. అనుమతి లేకుండా ఏపీలో సీబీఐ సోదాలు, దర్యాప్తు చేపట్టడానికి వీల్లేదంటూ సీఎం చంద్రబాబు వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా పశ్చిమ్‌బంగ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కూడా అదే బాటలో నడిచారు. మధ్యప్రదేశ్‌లో భాజపా మేనిఫెస్టో విడుదల చేసిన అనంతరం జైట్లీ మీడియాతో మాట్లాడుతుండగా విలేకరులు అడిగిన ప్రశ్నకు పై విధంగా సమాధానమిచ్చారు.
అయితే అరుణ జైట్లీ గారు పాపం వయసు పై బడటం చేత, ఆయన పార్టీ గొప్పగా చెప్పుకునే మోడల్ స్టేట్ గుజరాత్ లో, వాళ్ళ నాయకుడు మోడీ ముఖ్యమంత్రిగా ఉండగా, సిబిఐ మీద చేసిన చిత్రాలు మర్చిపోయినట్టు ఉన్నారు. అప్పట్లో సిబిఐ అంటే, మోడీ, షా ఎలా వణికి పోయే వారో, చిదంబరం హోం మంత్రిగా ఉండగా, కొన్ని రోజుల పాటు గుజరాత్ దాటి బయటకు రావటానికి ఎంత భయపడ్డారో మర్చిపోయారు అనుకుంటా. కాని ఈ దేశ ప్రజలకు గుర్తున్నాయి. అప్పట్లో జైట్లీ గారు కూడా, మా మోడీ పై సిబిఐని వదిలారు అని కాంగ్రెస్ పై విరుచుకు పడిన వారే.
మరి అప్పట్లో మీరు అవినీతి చేసారా ? మీ మోడి, షా అవినీతిలో కూరుకుపోయారా ? అందుకే భయపడి మీరు, మీ మోడీ షా, సిబిఐ పై విరుచుకుపడ్డారా జైట్లీ గారు ? అయినా ఇప్పుడు చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో, మీరు చేసే రాజకీయ దాడులకు మాత్రమే అడ్డుకట్ట ఉంటుంది. మీరు నిజంగా చంద్రబాబు అవినీతి చేసారు అంటే, కోర్ట్ కు వెళ్లి చెప్పండి. కోర్ట్ ఒకే అంటే సిబిఐ వేస్తారు. దర్జాగా వచ్చి, చంద్రబాబు పై దాడులు చేసుకోండి. అప్పుడు ప్రజలు కూడా నమ్ముతారు. అంతే కాని, మీరు చేసే రాజకీయ దాడులు అడ్డుకుంటున్నారని, బురద చల్లితే ఎలా జైట్లీ గారు. ఈ సోది ఆపి మీరు రాఫెల్ పై ఎందుకు సిబిఐ ఎంక్వయిరీ వెయ్యకుండా, మీకు వ్యతిరేకంగా ఉన్న సిబిఐ డైరెక్టర్ ని తప్పించాలని చూసారో చెప్పండి. కోర్ట్ లో ఎందుకు సిబిఐ ఆఫీసర్ లు కొట్టుకుంటున్నారో చెప్పండి. ముందు గాడి తప్పిన దేశ ఆర్ధిక వ్యవస్థను లైన్ లో పెట్టండి సార్...