ఏపీకి ప్రత్యేక హోదాపై ఇటు రాష్ట్రంలోనూ, అటు ఢిల్లీలోనూ తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. హోదాపై బీజేపీ సర్కార్ దాటవేత ధోరణిపై అన్ని స్థాయిల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. వీటి పై ఈ రోజు క్లారిటీ ఇస్తాను అంటూ 5.30కి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మీడియాతో సమావేశం పెట్టారు.. ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు, తదితర అంశాలపై మాట్లాడిన జైట్లీ, అన్ని విషయాలు రాష్ట్రం పై నెట్టేశారు... ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వడం ఆనవాయితీ అన్నారు. ప్రస్తుతం ఏ రాష్ట్రానికీ ఈ హోదాను ఇవ్వడం లేదని తెలిపారు..

jaitley 07032018 2

జీఎస్టీ రాబడి కేంద్ర, రాష్ట్రాలకు పంపిణీ జరుగుతుందని అన్నారు. తగినంత రాబడి లేకపోవడం వల్లే ఆశాన్య రాష్ట్రాలకు గతంలో ప్రత్యేక హోదా ఇచ్చారని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలకు 90:10 నిష్పత్తిలో నిధుల పంపిణీ జరుగుతోందని వివరించారు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌ ఆదాయం కోల్పోయిన మాట వాస్తవమేనన్నారు. ప్రత్యేక హోదా ఇప్పుడు ఏ రాష్ట్రానికీ ఇవ్వడం లేదన్నారు. హోదా మనుగడలో లేదు కాబట్టి ప్యాకేజీ ప్రకటించామని చెప్పారు.. ఏపీకి 60:40 శాతం నిధులు ఇవ్వాలని 14వ ఆర్థిక సంఘం చెప్పిందని, కానీ తాముప్రత్యేక పరిస్థితుల్లో 90:10 శాతం నిధులు ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. స్టేటస్ అనే పదం వాడకుండా సాయం అందిస్తున్నామని తెలిపారు..

jaitley 07032018 3

నాబార్డు ద్వరా నిధులు మంజూరు చేయాలని ఏపీ కోరిందని జైట్లీ చెప్పారు. నాబార్డుతో చర్చించి అందుకు అంగీకరించామని చెప్పారు. నాబార్డు, కేంద్రం ద్వారా నిధులన ఎస్‌పీవీకి పంపిస్తుందని, ఈ రుణాన్ని కేంద్రమే తీర్చే విధంగా ఆలోచిస్తున్నామన్నారు. కొన్ని రోజుల పాటు రెవిన్యూ లోటు భర్తీ చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌పై సానుకూల దృక్పథం ఉందన్నారు. రెవిన్యూ లోటు 2013-14 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 4,000 కోట్లు ఉంటుందని, దీనిలో రూ.138 కోట్లు మాత్రమే ఇవ్వవలసి ఉందన్నారు. పన్ను మినాహయింపులు ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వటం కుదరదని, మిగతా రాష్ట్రాలు కూడా అలాగే అడుగుతాయని చెప్పారు.. ఆంధ్రప్రదేశ్ పై సానుభూతి ఉందని చెప్తూ, నిధుల కేటాయింపు సెంటిమెంట్ ఆధారంగా ఉండదని జైట్లీ తేల్చి చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read