మన దేశ ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ గారు లాయర్ అన్న సంగతి తెలిసిందే... ఇప్పుడు ఇవే లాయర్ తెలివి తేటలు, మన రాష్ట్ర సమస్యల పై చూపిస్తూ, తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు... గురువారం కేబినెట్‌ సమావేశం వివరాలు వెల్లడించడానికి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో, ఏపి పై అడిగిన ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం విస్మయానికి గురి చేసింది... రెవెన్యూలోటు భర్తీ, ప్రత్యేక ప్యాకేజీ కింద ఆర్థిక సాయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక ఫార్ములాను ఆంధ్రప్రదేశ్‌ అధికారులకు చెప్పిందని, దానిపై ఆ ప్రభుత్వ స్పందన కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు.. ఏపీ ప్రభుత్వం తమ అభిప్రాయం చెప్పిన మరుక్షణమే తాము నిర్ణయం వెలువరించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

jaitley 02032018 1

అయితే, విలేకరులు ఆ ఫార్ములా ఏంటో చెప్పండి అంటే మాత్రం, దాన్ని బహిర్గతం చేయలేనని పేర్కొన్నారు... దీని పై కేంద్ర ప్రభుత్వంతో చర్చల్లో పాల్గున్న రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు మీడియాతో మాట్లాడుతూ, జైట్లీ గారు ఆ స్థాయిలో ఉండి అలా మాట్లాడటం అభ్యంతరకరం అని చెప్పారు... వారు మనకు ఏ ఫార్ముల పంపించలేదని చెప్పారు... పార్లమెంట్ సమావేశాలు జరిగే టైంలో చర్చలు జరిపాం అని, అప్పట్లో మనకు రావాల్సిన 16 వేల కోట్ల పై అడిగామాని, వారు రుణ మాఫీ అని, అవి అని, ఇవి అని అన్నీ వాటిల్లో లెక్కేసి, ఎదో లెక్క చెప్పారని, మనం వాటికి ఒప్పుకోలేదు అని చెప్పారు..

jaitley 02032018 1

అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా, దీని పై ఈ రోజు జరిగిన ఎంపీల మీటింగ్ లో మాట్లాడారు... ఆర్ధికలోటు భర్తీకి ఫార్ములా ఇచ్చామన్న కేంద్రం వాదన పై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం ఫార్ములా ఇచ్చారు..?వాళ్లిచ్చిన ఫార్ములా ఏమిటి..?
మేము అడగడం ఏమిటి..? ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాలిగాని మీరే చెప్పండి అనడం కరెక్ట్ కాదు, ఆ ఫార్ములా ఏంటో ప్రజల మందు ఉంచండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. కేంద్రం తొలుత అంగీకరించిన రూ.7,500 కోట్ల రెవిన్యూలోటులో ఇప్పటివరకూ ఇచ్చిన రూ.4వేల కోట్లు మినహాయించి, మిగిలిన రూ.3,500 కోట్లు విడుదల చేయాలని ఇదివరకే కోరినట్లు తెలిపారు.

jaitley 02032018 1

అయితే కేంద్రం మాత్రం, మరో 100-150 కోట్లు ఇస్తే సరిపోతుంది అంటున్నారని చెప్పారు... కాగ్‌ నిర్ధారించిన రూ.16వేల కోట్ల లెక్క సరైందో కాదో తేల్చడానికి 14వ ఆర్థికసంఘం అధ్యక్షుడు వైవీరెడ్డి నేతృత్వంలో కమిటీ వేయాలని సూచించారు. అయితే ఇంతవరకూ కేంద్రం మాత్రం తాను చెప్పిన దారిలోకే రావాలని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఏపీ ప్రభుత్వం మాత్రం తన నిర్ణయంలో మార్పులేదని చెప్పినట్లు తెలుస్తోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read