ఢిల్లీలో శీతాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇవాళ నవ్యాంధ్ర రాజధాని అమరావతి పై పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేసారు కేంద్ర ఆర్ధిక మంత్రి జైట్లీ... అమరావతికి ప్రపంచ బ్యాంకు రుణం పై ఆర్ధిక మంత్రి జైట్లీ ప్రకటన చేసారు... మంగళవారం రాజ్యసభలో అమరావతి నిర్మాణానికి నిధుల కేటాయింపు పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు. ఎంపీ విజయసాయి రెడ్డి ఎప్పుడూ లిటిగేషన్ ప్రశ్నలు వేస్తూ, రాష్ట్రా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి అనే ఉద్దేశంతో, ఇలా ప్రశ్నలు వేస్తారు కాని, ఇప్పటి వరకు అన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగానే సమాధానాలు వచ్చయి.. ఈకోవలో, ఇవాళ అమరావతి పై ప్రశ్నలు వేసారు... దీనికి సమాధానంగా జైట్లీ ప్రకటన చేసారు... ఆ ప్రకటన సారంశం ఇలా ఉంది...

parliament 02012018 3

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి రూ. 3324 కోట్లు కావాలని ఏపీ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకును కోరిందన్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి రూ. 3,324 కోట్ల రుణం ఇచ్చే అంశం ప్రపంచ బ్యాంకు పరిశీలనలో ఉందని చెప్పారు. సంప్రదింపుల ప్రక్రియ పూర్తయిన వెంటనే రుణం మంజూరు అవుతాయన్నారు. కాగా, అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం నిర్మాణానికి కేంద్రం ఇప్పటికే రూ. 1500 కోట్లు ఇచ్చిందని వెల్లడించారు. రాజధాని నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సిన నిధులు ఇస్తామని చెప్పారు... విభజన చట్టం ప్రకారం కేంద్రం సహాయం చేస్తుంది అని చెప్పారు...

parliament 02012018 2

మరో వైపు ఇదే ప్రపంచ బ్యాంకు రుణం పై లోన్ ఇవ్వద్దు అంటూ, వైసిపి పార్టీ ముసుగులో ప్రపంచ బ్యాంకుకు ఈ మెయిల్స్ రాసిన విషయం తెలిసిందే... లేకపోతే ఈ పాటికే లోన్ వచ్చి ఉండేది.. ఈ పిర్యాదులు వల్ల క్షేత్ర స్థాయి పరిశీలనలు జరిపి, లోన్ ఇవ్వాలి కాబట్టి, మరింత ఆలస్యం అవుతుంది. అమరావతిని అడ్డుకోవటానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసి, చివరకు గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులు వేసి, భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం చేస్తూ, అమరావతిని భ్రమరావతి అని ఎగతాళి చేస్తూ, ఇవాళ వీళ్ళు ఎదో ఉద్దరిస్తున్నట్టు పార్లమెంట్ లో ప్రశ్నలు వేస్తున్నారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read