ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మధ్య గత 15 రోజులుగా నీళ్ళ డ్రామా నడుస్తుంది. నువ్వు కొట్టినట్టు నటించు, నేడు ఏడ్చినట్టు నటిస్తే అనే చందాన ఇక్కడ వ్యవహారాలు నడుస్తున్నాయి. ఈ నాటకంలో లబ్ది పొందుతుంది మాత్రం తెలంగాణా అనే చెప్పాలి. ఒక పక్క తెలంగాణా రాష్ట్రం మన ప్రాజెక్టుల పై అభ్యంతరం చెప్పింది. తరువాత గత వారం రోజులుగా కరెంటు ఉత్పత్తి చేస్తూ, నీళ్ళు వాడేసుకుంటుంది. దీంతో అటు శ్రీశైలంలో, అలాగే ఇక్కడ పులించింతలలో కరెంటు ఉత్పాత్తి చేస్తూ ఉండటంతో, ఆ నీళ్ళు కిందకు వస్తున్నాయి. అయితే ఇక్కడ ఏపి ప్రభుత్వం ఆ నీటిని కాలువలకు మళ్ళించకుండా, సముద్రంలోకి వదులుతుంది. ఇలా ఎందుకు చేస్తుందో ఎవరికీ అర్ధం కావటం లేదు. మరో పక్క రాజశేఖర్ రెడ్డిని తిడుతున్నా, ఇటు వైపు నుంచి రెస్పాన్స్ లేదు. అదేమిటి అంటే, అక్కడ ఆంధ్రా వాళ్ళు ఉన్నారు కాబట్టే మౌనం అంటూ, కేవలం ప్రధానికి లేఖ రాసి ఊరుకున్నారు. ఇప్పటి వరకు తెలంగాణా ఇష్టం వస్తున్నట్టు చేస్తున్నా, ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి సరైన రెస్పాన్స్ లేదు. ఈ నేపధ్యంలోనే తెలంగాణా హైకోర్టులో కృష్ణా జిల్లా వాసి, హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేసారు. తెలంగాణా ఒప్పందాలు ఉల్లంఘించి విద్యుత్ ఉత్పత్తి చేసి ఏపికి అన్యాయం చేస్తుందని, విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఇచ్చిన జీవో రద్దు చేయాలి అంటూ, పిటీషన్ దాఖలు చేసారు. మరి తెలంగాణా హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి. ఈ వివాదం కోర్టుకు చేరటంతో, అసలు వాస్తవం ఏదో, డ్రామా ఏదో తేలిపోనుంది అనే చెప్పాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read