పవన్ కళ్యాణ్ స్పీచ్లు ఎప్పుడైనా విన్నారా ? ఎక్కువగా నీతి సూత్రాలు చెప్తూ ఉంటారు. నేను కులానికి వ్యతిరేకం అంటారు, కట్ చేస్తే, ఆయన పార్టీలో ఇప్పటి వరకు చేరింది, 90 శాతం ఆయన కులం వారే.. అన్ని పార్టీల్లో వ్యాపారస్తులు ఉన్నారు అంటారు, కట్ చేస్తే ఆయన వెనుక ఉండే తోట చంద్రశేఖరే పెద్ద వ్యాపారవేత్త.. అన్ని పార్టీలకు చానల్స్ ఉన్నాయి, పేపర్లు ఉన్నాయి అంటారు, కట్ చేస్తే ఆయనకు ఇప్పుడు రెండు చానల్స్, ఒక పేపర్ వచ్చి చేరాయి.. డబ్బులు లేవు అంటారు, ఎకరాలు ఎకరాలు కొంటున్నాడు.. ఇక వేరే పార్టీ వాళ్ళు వస్తే చేర్చుకునేది లేదు అంటారు, కట్ చేస్తే, ఇప్పటికే ఆయన 20 మంది ఎమ్మల్యేలతో టచ్ లో ఉన్నారు అంట.. వీళ్ళ మాటలు ఇలా ఉంటాయి మరి.

pk 25082018 2

పవన్ తో 20 మంది ఎమ్మల్యేలు టచ్ లో ఉండటం ఏమిటి అనుకుంటున్నారా ? ఈ వ్యాఖ్యలు చేసింది వాళ్ళ పార్టీ నేతలే. పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీలో చేరడానికి ఏపీకి చెందిన 20 ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ కన్వీనర్ వి.పార్థసారథి తెలిపారు. ఆయ‌న నిన్న తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో జ‌న‌సేన నేత‌ల‌తో స‌మావేశ‌మై ఈ వివ‌రాలు వెల్ల‌డించారు. ఆ ఎమ్మెల్యేలంతా ఇప్పటికే పవన్‌తో చర్చించారని, ఆయన నిర్ణయం తీసుకుని, తేదీ ఖరారు చేసిన తర్వాత వారంతా వచ్చి పార్టీలో చేరుతారని ఆయ‌న పేర్కొన్నారు. వివిధ పార్టీలకు చెందిన పలువురు ముఖ్యనేతలు కూడా జనసేనలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

pk 25082018 3

పాత, కొత్త తరం మేలు కలయికతో పార్టీ ముందుకెళ్తుంద‌ని, పార్టీలో నవతరానికి 60 శాతం సీట్లు ఇస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల కోసం రాష్ట్రం మొత్తానికి ఓ మేనిఫెస్టో, ఒక్కో నియోజకవర్గాని ఒక్కొటి చొప్పున మేనిఫెస్టోలు తయారు చేస్తామని ఆయ‌న‌ వివరించారు. ఈయన ఈ వ్యాఖ్యల చేసారో లేదో, జన సైనికులు డాన్స్ లు వేస్తున్నారు. చూసారా, మా నాయకుడు దుమ్ము దులుపుతున్నాడు. మా నాయకుడు కోసం, 20 మంది ఎమ్మల్యేలు లైన్ లో ఉన్నారు. ఇది మా సత్తా అంటూ డాన్స్ వేస్తున్నారు. అయితే, ఈ వ్యాఖ్యలు చేసిన ఆ జనసేన నాయకుడుని, ఈ వ్యాఖ్యలు చూసి డాన్స్ వేస్తున్న పవన్ ఫాన్స్ ని చూసి, ప్రజలు నవ్వుకుంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read