తెలుగు మీడియా చాలా వరకు పార్టీల పరంగా విడిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రభుత్వాల వారికీ సొంత మీడియా ఉంది. ఇక కొన్ని చానల్స్ వాళ్ళ అనునాయులవి. ఇక కొన్ని మీడియా చానల్స్, సందర్భానికి తగ్గట్టు చేస్తూ ఉంటాయి. మరికొన్ని, ఒక పార్టీ మీద వ్యతిరేకతతో, మరో పార్టీకి అనుకూలంగా ఉంటాయి. ఒకటి రెండు తప్ప, మిగతావి అన్నీ ఒక సైడ్ తీసుకుని వాయిస్తూ ఉంటారు. అయితే, ఈ సందర్భంలో ఎవరు ఎటు వైపు ఉన్నారో, తెలుసుకోక, గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తన పై కొన్ని చానల్స్ లో పని గట్టుకుని, తెలుగుదేశం పార్టీ ప్రచారం చేపిస్తుంది అంటూ, వరుసగా ట్వీట్లు వేసి చేసిన రచ్చ తెలిసిందే. అయితే ఇప్పుడు అదే ఛానల్ పవన్ కళ్యాణ్ ని కించ పరిచే కధనాలు వేస్తుంది అంటూ, జనసేన పార్టీ అఫిషియల్ ప్రెస్ నోట్ విడుదల చేసి ఖండించింది. అయితే ఆ ఛానల్, అప్పుడు ఇప్పుడు, చంద్రబాబు కంట్రోల్ లో లేదు. తెలంగాణా అధికార పక్షానికి కావాల్సిన వారి ఛానల్ అది. కానీ పవన్ కళ్యాణ్ ఈ సారి ఎవరినీ నినదించకుండా, ఆ ఛానల్ వైఖరిని ఖండిస్తూ సరి పెట్టారు. గతంలో లాగా, చంద్రబాబు కారణం అంటూ, వారం రోజులు పాటు రచ్చ చెయ్యలేదు. ఇక విషయానికి వస్తే, దీని మొత్తం వెనుక ఒక బీజేపీ నాయకురాలు పెట్టిన సోషల్ మీడియా కామెంట్, ఈ రచ్చకు కారణం అయ్యింది.

పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా, అనేక మంది విష్ చేసారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తులో ఉండటంతో, అనేక మంది ఉత్తరాది నాయకులు పవన్ కు విష్ చేసారు. అయితే ఎప్పుడూ లేనిది, ఈ సారి పవన్ కళ్యాణ్ అందరినీ పేరు పేరునా విష్ చేసారు. ఈ నేపధ్యంలో ఉత్తరాది నాయకులకు కూడా విష్ చేసారు. అయితే, సినీ నటి, బీజేపీ నాయకురాలు అయిన మాధవీ లత, పవన్ అలా ఉత్తరాది వారికి స్పందించటం బాగోలేదు అంటూ, ఒక కామెంట్ పెట్టారు. ఆ పోస్ట్ వైరల్ కావటంతో, ఒక ప్రముఖ ఛానల్ ఆ పోస్ట్ ని, తన ఛానల్ లో ప్రచారం చేసింది. అయితే దీని పై జనసేన తీవ్రంగా స్పందించింది. దేశ సమగ్రతకు భంగం కలిగించే అలాంటి విషయాల పై ఎందుకు ఇంత ప్రచారం అంటూ ఒక బహిరంగ లేఖ ఆ ఛానల్ కు రాసింది.

బాధ్యతగా మెలగాలని కోరింది. ఇక జనసేన సోషల్ మీడియా కార్యకర్తలు, ఆ ఛానల్ పై సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. అయితే ఒక పక్క జనసేనతో పొత్తు ఉన్నా, బీజేపీ నేత, గత ఎన్నికల్లో పోటీ చేసిన మాధవీ లత అలా ఎందుకు పవన్ పై కామెంట్స్ చేసారో ఎవరికీ అర్ధం కాలేదు. అయితే ఆమె ఎన్నికల తరువాత పెద్దగ ఆక్టివ్ గా లేదు, అలా అని పార్టీ నుంచి బయటకు వచ్చింది లేదు. మరి బీజేపీ ఆమెను ఈ చర్య తరువాత సస్పెండ్ చేస్తుందో లేదో చూడాలి. అయితే, గతంలో తన పై వచ్చిన ప్రోగ్రాంలు అన్నీ చంద్రబాబు చేపించాడు అని చెప్పిన పవన్ కళ్యాణ్, ఇప్పటికైనా నిజం తెలుసుకున్నారో లేదో. అదీ ఇప్పుడు ఆ ఛానల్ ఎవరి చేతిలో ఉందో అందరికీ తెలిసిందే. చంద్రబాబుని అన్నట్టు, ఆయన్ను అంటే కుదరదు అనుకున్నారో ఏమో కానీ, ఖండనతో ఆపారు. ఏది ఏమైనా, ఇలాంటివి ఎవరు చేసినా మంచిది కాదు. పవన్ లేఖతో అయినా ఆ టీవీ ఛానల్ కంట్రోల్ అవుతుందేమో చూద్దాం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read