పవన్ ఏ ప్రకటన చేసినా అందులో కన్ఫ్యూజన్ పీక్స్ లో ఉంటుంది. మొన్నటి దాకా, ప్రజా రాజ్యం పార్టీకి, జనసేనకు సంబంధం లేదు అన్నారు. మరో పక్క చిరంజీవికి రాజకీయంగా ఈ స్థితి పట్టించిన వారిని వదిలిపెట్టం అంటాడు. చిరంజీవి పార్టీని కాంగ్రెస్ లో కలిపేసి, రాజ్యసభ మెంబెర్ అయ్యి, మంత్రి అయితే, దానికి ఎవరినో అనటం ఏంటో, ఎవరికీ అర్ధం కాదు. కాంగ్రెస్ పార్టీని తిడతాడు, కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్న అన్నను మాత్రం ఏమి అనడు. ఇలా అనేక సార్లు, ప్రజా రాజ్యం పార్టీ పతనానికి, కక్ష తీర్చుకోవటం కోసమే, రాజకీయాల్లోకి వచ్చాను అనే విధంగా, పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటారు. ఈ రోజుతో, జనసేన = ప్రజారాజ్యం 2 అనేది కన్ఫర్మ్ అయిపొయింది. జనసేన పార్టీ ఎవరిదో కాదని, మెగాస్టార్‌ చిరంజీవి అభిమానుల్లో ఒకరిది అంటూ, చిరంజీవి అభిమానులని, మాజీ ప్రజారాజ్యం కార్యకర్తల్ని, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారిని, ఈ రోజు జనసేనలోకి ఆహ్వానించారు.

janasena 09072018 2

ఇలా ఆహ్వానించటం తప్పు కాదు. ప్రజారాజ్యం నుంచి, జనసేనలోకి రావటం తప్పు కాదు. చిరంజీవే వచ్చి, జనసేనలోకి చేరినా అభ్యంతరం ఎవరికీ ఉండదు. కాని పవన్ కళ్యాణ్ ఇచ్చే బిల్డ్ అప్ లు, చేసే హడావిడి చూస్తే మాత్రం, ప్రజలు కచ్చితంగా ప్రశ్నిస్తారు. పవన్ కళ్యాన్ కు అండగా ఉండేందుకు మెగా ఫ్యామిలీ అభిమానులు అంతా రెడీ అయ్యారు. వీరు ఇది వరకు ప్రజా రాజ్యం పార్టీలో ఉన్నారు. మెగా ఫ్యామిలీ అభిమానులంతా ఒకే గూటికి చేర్చటమే ప్రధాన అంశంగా ఉంటుందని అంటున్నారు. మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్గా ఉంటూనే రాజకీయంగా జనసేన కు జై కొట్టాలనే ఎజెండాతోనే ఈ భేటీ జరుగుతుందని తెలుస్తోంది.

janasena 09072018 3

అయితే చిరంజీవి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నప్పటికీ ఆయన అభిమానులు మాత్రం కాంగ్రెస్ రాజకీయాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారని అంటున్నారు. దానికి తోడు చిరంజీవి మళ్లీ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించే పరిస్థితిలు కూడా కన్పించటంలేదు. ప్రజారాజ్యానికి అండగా నిలిచి పార్టీకోసం వని చేశారు. పవన్ కళ్యాణ్ పార్టీని స్థాపించి పూర్తి టైం రాజకీయాలకు కేటాయిస్తున్న నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ అంతా ఆయనకు అండగా నిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. మెగా ఫ్యామిలీలో అందరూ రాజకీయాల్లో పాల్గొనక పోయినప్పటికీ వారంతా పవన్ కళ్యాణ్ స్థాపించిన పార్టీకే అండగా నిలిచే అవకాశం ఉందని చిరంజీవి అభిమాని ఒకరు వ్యాఖ్యానించారు. అయితే, మొన్నటి దాకా, నా దారి వేరు, చిరంజీవి దారి వేరు అని చెప్పిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు సడన్ గా ప్లేట్ మార్చటం వెనుక భారీ ప్లాన్ ఉంది అంటున్నారు. చివరి సీన్ లో, జనసేన సినిమాలోకి, చిరంజీవి ఎంట్రీ ఇస్తారని, అందుకే ముందుగా గ్రౌండ్ వర్క్ రెడీ చేస్తున్నారని అంటున్నారు. ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే, మూసేసిన కంపెనీ, తెరుచుకున్నట్టు, ప్రజా రాజ్యం పార్టీ - 2 మళ్ళీ ప్రజల ముందుకు వస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read