బీజేపీ, జనసేన మధ్య పొడిచిన పొత్తు, ఏడాది తిరగకుండానే, రోడ్డున పడింది. నిన్న ఏకంగా పవన్ కళ్యాణ్, తెలంగాణా బీజేపీ వైఖరి పై బహిరంగంగా నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. బీజేపీ ద్రోహం చేసిందని, తమను అవమానించిందని, వాపోయారు. అయితే అది తెలంగాణా బీజేపీ వరుకే పరిమితం అని, దాన్ని కేంద్ర అధిష్టానం చూసుకుంటుందని, ఏపి బీజేపీ నేతలు కవర్ చేసారు. అయితే ఇప్పుడు ఏపిలో ఉన్న బీజేపీ పై కూడా జనసేన ఫైర్ అయ్యింది. స్థానిక సంస్థల్లో ఓటమికి బీజేపీనే కారణం అని తేల్చి చెప్పింది. జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్, బీజేపీ పై నిప్పులు చెరిగారు. జనసేన పార్టీకి, బీజేపీ పార్టీ వల్ల విజయవాడలో పెద్ద ఎత్తున నష్టం జరిగిందని అన్నారు. మేము ఎక్కడకు వెళ్ళినా సరే, ఎస్సీ, ఎస్టీ, ముస్లిమ్స్ మమ్మల్ని బీజేపీతో కలిసి వెళ్ళినందుకు వ్యతిరేకించారని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో గెలుస్తాం అనుకున్న స్థానాలు కూడా, బీజేపీ వల్ల ఓడిపోయాం అని అన్నారు. మేము ఏమి తప్పు చేసామని, ప్రజలకు అండగా ఉన్నామని, ప్రజాసమస్యల పై ఎప్పటికప్పుడు నిలదీసాం అని, మేము ఏమి చేయలేదని ప్రశ్నించారు. ఇది మా బాధ అని, మళ్ళీ ఈ ఓటమి గెలుపుగా మారాలంటే, 5 ఏళ్ళు ఎదురు చూడాలని అన్నారు. మా అభ్యర్ధుల్లో ఏమి తప్పు ఉంది, ఏమి లోపం ఉందని ప్రశ్నించారు. విజయవాడలో ఎక్కడైనా బీజేపీ, జనసేన పార్టీకి అండగా నిలబడిందా అని ప్రశ్నించారు.

potina 15032021 2

ఎక్కడైనా మాతో కలిసి, బీజేపీ పార్టీ క్షేత్రస్థాయిలో ప్రయాణం చేసిందా అని ప్రశ్నించారు. జెండా పట్టుకునే మనిషి కూడా మాకు, 38 స్థానాల్లో కరువు అయ్యారని అన్నారు. మీకు బలం ఉన్న చోట, మేము పని చేసాం కదా అని బీజేపీని ప్రశ్నించారు. నిజాయతీగా బీజేపీ గెలుపు కోసం పని చేసాం అని అన్నారు. ఈ మొత్తం వ్యవహారం పై, పార్టీ అధిష్టానానికి ఒక రిపోర్ట్ పంపిస్తామని అన్నారు. మొత్తం లెక్కలు అని అధిష్టానానికి ఇస్తాం అని అన్నారు. ప్రజలు అయితే, పొత్తుని ఒప్పుకోవటం లేదని, పార్టీ అధిష్టానం ఈ దిశగా ఆలోచన చేయాలని అన్నారు. విజయవాడ తూర్పులో, వెస్ట్ లో, కొన్ని స్థానాలు, గెలవాల్సిన స్థానంలో, బీజేపీ వల్ల ఓడిపోయాం అని, ముస్లిమ్స్ ఏకపక్షంగా వైసీపీకి ఓటు వేసారని అన్నారు. తాము పెద్ద పెద్ద రోడ్ షోలు చేసినా, బీజేపీని ఆహ్వానించినా వారు రాలేదని అన్నారు. పొత్తు పై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని, ప్రజలు, కార్యకర్తలు మాత్రం, పొత్తుకు ఒప్పుకోవటం లేదని అన్నారు. నిన్న పవన్ కళ్యాణ్ గారే కార్యకర్తల అభీష్టం మేరకు నడుచుకుంటానని చెప్పారని, మేము ఆయనకు అన్నీ చెప్తాం అని అన్నారు. అయితే దీని పై ఇంకా ఏపి బీజేపీ నేతలు ఎవరూ స్పందించలేదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read