ఈ రోజు వైసిపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, విజయవాడలో జరిగిన మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి వేడుకల్లో, పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు మీడియం ను పూర్తిగా ఎత్తేసి, కేవలం ఇంగ్లీష్ మీడియం మాత్రమే, ప్రభుత్వ స్కూల్స్ లో ఉంచటం పై, పవన్ కళ్యాణ్, వైసిపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్వీట్లు చేసిన విషయం పై, ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. అయితే, ఆయన పదవి, హోదా కూడా పక్కన పెట్టి, పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత వ్యాఖ్యలు చెయ్యటం, సంచలనంగా మారింది. "యాక్టర్ పవన్ ఉన్నారు. ఆయన ముగ్గురు భార్యలకు ఐదుగురు పిల్లలు.. వాళ్లు ఏ స్కూల్లో చదువుతున్నారు.?" అంటూ జగన్ చేసిన వ్యాఖ్యల పై అందరూ ఆశ్చర్యపోయారు. జగన్ విమర్శ చెయ్యాలి అనుకుంటే, రాజకీయంగా చెయ్యాలని, ఇలా వ్యక్తిగతంగా చెయ్యటం కరెక్ట్ కాదని, రేపు పవన్ వైపు నుంచి తిరిగి, జగన్ కుటుంబ సభ్యులను కూడా ఇలాంటి ప్రశ్నలే వేస్తే, విషయం చాలా దూరం వెళ్తుందని, విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

janasena 11112019 1

అయితే ఈ విషయం పై, జనసేన పార్టీ అధికారికంగా స్పందించింది. రాజకీయ వ్యవహారాల కమిటి చైర్మెన్, నాదెండ్ల మనోహర్, జనసేన కార్యకర్తలను ఉద్దేశించి, ఒక పత్రికా ప్రకటన విడుదల చేసారు. జగన్ మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలకు, ఎవరూ రియాక్ట్ అవ్వద్దు అంటూ, విజ్ఞప్తి చేస్తున్నట్టు ఆ ప్రకటనలో తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల కోసం చేస్తున్న పోరాటాన్ని, పక్కదారి పట్టించి, ఇలా వ్యక్తిగత గొడవను పెంచటానికి, జగన్ ప్రయత్నం చేస్తున్నారని, జనసైనికులు ఈ విషయం పై కాకుండా ఇసుక మీదే ప్రభుత్వాన్ని నిలదియ్యలని అన్నారు. మనం పాలసీ మీద పోరాడుతుంటే, వాళ్ళు వ్యక్తిగత దాడి చేస్తున్నారని, మనం ఇవన్ని ప్రజల కోసం భరిద్దాం అని నాదెండ్ల అన్నారు.

janasena 11112019 1

మంగళవారం పవన్ కళ్యాణ్ విజయవాడ వస్తున్నారని, ఆ రోజు సాయంత్రం మీడియాతో మాట్లాడతారని, అప్పుడు జగన్ చేసిన వ్యాఖ్యల పై, ఆయనే స్పందిస్తారని, పార్టీ శ్రేణులు ఎవరూ ఈ విషయం పై, అభ్యంతరక భాషలో స్పందించవద్దు అని కోరారు. ఇది ఇలా ఉంటే, జనసేన శతఘ్ని టీం మాత్రం, సోషల్ మీడియాలో జగన్ చేసిన వ్యాఖ్యలకు బదులు ఇస్తూ, గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలనే చెప్పింది. ఒక వీడియో రిలీజ్ చేసి, ఈ రోజు జగన్ మాట్లాడిన మాటలు చూపిస్తూ, దానికి పవన్ సమాధానంగా, గతంలో పవన్ చేసిన వ్యాఖ్యలు వినిపించారు. 'జగన్ ని అడగాలనుకుంటున్నాను నా పెళ్లిళ్ల వల్లే రాష్ట్ర విభజన జరిగిందా? నా పెళ్లిళ్ల వల్లే అవినీతి జరిగిందా? నా పెళ్లిళ్ల వల్లే మీరు జైలుకెళ్లా? తమాషాగా ఉందా? ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు' అని పవన్ చేసిన వ్యాఖల వీడియో పోస్ట్ చేసారు. చివరకు ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో మరి ?

Advertisements

Advertisements

Latest Articles

Most Read