ఒకే ఒక్క అడుగుతో, ఆంధ్రప్రదేశ్ కోసమే మా పోరాటం అంటూ, బీజేపీ ముసుగు వేసుకుని, డ్రామాలు ఆడుతున్న జగనసేన, వైసిపీ వేషాలు ప్రజలు గుర్తించారు... ‘‘ఇది మన ఒక్కరి సమస్య కాదు. మొత్తం రాష్ట్రానికి చెందిన సమస్య. అందుకే అఖిలపక్ష సమావేశం నిర్వహించి అందరినీ కలుపుకొని వెళ్లాలని నిర్ణయించాం. వారి సలహాలు, సూచనలతో మోడీ పై, కేంద్రం పై పోరాటాన్ని మరింత బలోపేతం చేద్దాం!’’ అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో, అన్ని పార్టీలని, నిన్న సచివాలయానికి రమ్మని, అఖిలపక్ష నేతలను ఆహ్వానించారు.. కేంద్రం ఏమి ఇచ్చింది, మనం ఎంత ఖర్చు పెట్టింది, ఇలా అన్ని వివరాలు అఖిలపక్షం, సంఘాల ముందు ఉంచి, అందరం కలిసి మనం ఎలా పోరాడాలి అన్నది చర్చించారు...

cbn 28032018

ఈ సమావేశానికి, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, ఏపీ ఎన్జీవో సంఘం, ప్రత్యేకహోదా, విభజన హామీల సాధన సమితి, ఆప్‌, ఫార్వర్డ్‌ బ్లాక్‌, సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్‌, గెజిటెడ్‌ అధికారుల సంఘం, ఏపీ ఫెడరేషన్‌ ఆఫ్‌ చాంబర్స్‌ అండ్‌ కామర్స్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశానికి రాని వారు ఎవరో తెలుసా ? బీజేపీ, వైసిపీ, జనసేన మాత్రమే, ఈ అఖిలపక్ష సమావేశానికి రాలేదు... ఇప్పటికే వీరు ముగ్గురు కలిసి, రాష్ట్రాన్ని ఎలా నాశనం చెయ్యాలని చేస్తున్నారో, చూస్తూనే ఉన్నాం...

cbn 28032018

మోడీని ఒక్క మాట కూడా, జనసేన, వైసిపీ, ఇప్పటి వరకు అనలేదు.. వీళ్ళ టార్గెట్ కేంద్రంతో పోరాడుతున్న చంద్రబాబే.... అయితే, నిన్నితో వీళ్ళ ముసుగు తొలిగిపోయింది... ఇది మోడీకి వ్యతిరేకంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున పెడుతన్న సమావేశం కావటంతో, మోడీకి లొంగిపోయిన, జనసేన, వైసీపీ, ఈ సమావేశానికి రాలేదనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. పవన్ కళ్యాణ్, తెలంగాణా పోరాటం ఆదర్శంగా తీసుకోవాలి, అందరు కలిసి కేంద్రం పై పోరాడాలి అని చెప్తూ, అందరం కలిసి పోరాడుదాం రండి అని ప్రభుత్వం పిలిస్తే, మేము మోడీకి వ్యతిరేకంగా సమావేశం అయితే వచ్చేది లేదు అని తేల్చి చెప్పారు... ఇక జగన్ సంగతి అయితే సరే సరి... త్వరలో వీళ్ళ ముగ్గురూ ఒకే వేదిక పై వచ్చి, కేంద్రాన్ని ప్రొటెక్ట్ చేస్తూ, కేంద్రం పై యుద్ధం చేస్తున్న చంద్రబాబు పై, కలిసి పోరాడతారనే సమాచారం గుప్పు మంటుంది... ముగ్గురూ కలిసి పోరాడితేనే, చంద్రబాబుని ఎదుర్కోగలం అనే అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం...

Advertisements

Advertisements

Latest Articles

Most Read