జంగారెడ్డిగూడెంలో కల్తీ నాటు సారా మరణాలు అన్నీ సహజ మరణాలు అంటూ, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, నిన్నటి నుంచి బుకాయిస్తున్న సంగతి తెలిసిందే. నిన్నటి నుంచి కూడా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, అవి కల్తీ సారా మరణాలు కావని, తెలుగుదేశం పార్టీ రాజకీయం చేస్తుంది అంటూ, గోల గోల చేసారు. అయితే నిన్నటి నుంచి తెలుగుదేశం పార్టీ కల్తీ సారా మరణాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళటంలో సక్సెస్ అయ్యింది. ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చింది. తెలుగుదేశం పార్టీ ఆందోళన దెబ్బకు ప్రభుత్వం దిగి రాక తప్పలేదు. గత ముందు వరకు అవి సహజ మరణాలే అని బుకాయించిన ప్రభుత్వం, ఎట్టకేలకకు, జంగారెడ్డిగూడెం చావుల వెనుక, బాధ్యులైన వారి పైన కేసులు నమోదు చేసారు. మొత్తం ఈ సంఘటన పైన 10 ఎఫ్ఐఆర్ లను ప్రభుత్వం పెట్టింది. నాటుసారా ఆక్రమంగా నిల్వ చేసిన, పది మంది పైన కేసులు పెట్టారు. అలాగే అనుమానాస్పదంగా మృతి చెందారని, మూడు కేసులు నమోదు చేసారు. అలాగే తన భర్త నాటు సారా తాగే చనిపోయాడని ఫిర్యాదు చేయటంతో, మరో మూడు కేసులు నమోదు చేసారు. ఇన్నాళ్ళు బుకాయిస్తూ వచ్చిన ప్రభుత్వం, ఒత్తిడికి తలొగ్గక తప్పలేదు. ఇది కూడా కోర్టుకు వెళ్తే, తమ బండారం బయట పడుతుంది అని కాబోలు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read