Sidebar

17
Mon, Mar

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ పని చేసినా వ్యతిరేకించాలి అనే ఆదేశాలు ఒక పక్క... ప్రజా సమస్యలు తీర్చే వేదిక ఒక పక్క... రెండిట్లో ఎదో తేల్చుకోలేక ప్రతిపక్ష పార్టీ ఎమ్మల్యేలు ఇబ్బంది పడుతున్న వేళ, గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మల్యే ప్రజలు సమస్యలు తీర్చే వేదికకే నా ఓటు అని చెప్పి, అధినేత జగన్ కు షాక్ ఇచ్చారు... నిజానికి లోటస్ పాండ్ నుంచి, జన్మభూమి కార్యక్రమంలో ఎమ్మల్యే నుంచి, క్రింద స్థాయి కార్యకర్తలు దాకా, ఎవరూ పాల్గునకూడదు అనే ఆదేశాలు వెళ్ళాయి... ఇది ప్రభుత్వ కార్యక్రమం అని, తెలుగుదేశం కార్యక్రమం కాదని, మనం కూడా ప్రజలకు దగ్గర అవ్వచ్చు అని కొంత మంది సీనియర్లు చెప్పినా, వారు వినకుండా, ఇది జగన్ ఆదేశం, పాటించాల్సిందే అని చెప్పారు.. అయితే ఈ ఎమ్మల్యే మాత్రం, రివర్స్ లో చేసారు...

lotus pond 03012018 1

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమం మంచిదేనని వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. జన్మభూమి - మా ఊరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని మంగళ్‌దాస్‌నగర్‌, అహ్మద్‌నగర్‌లో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది ఐదో జన్మభూమి అన్నారు. వృద్ధులు, వితంతు, దివ్యాంగులకు పింఛన్లు, రేషన్‌ కార్డులు అందజేశారని, అయితే ఇంకారాని వారు ఎందరో ఉన్నారని వారందరికీ న్యాయం చేయాలన్నారు. ఇదే విధంగా పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు.

lotus pond 03012018 1

అయితే ముస్తఫా వ్యాఖ్యల పై లోటస్ పాండ్ ఆరా తీసింది... మీరు జన్మభూమిలో పాల్గునవద్దు అని ఆదేశాలు ఇచ్చినా ఎందుకు పాల్గున్నారో చెప్పాలి అని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి అని చెప్పినట్టు సమాచరం... దీనికి ఎమ్మల్యే వివరణ ఇస్తూ, ప్రభుత్వం కోసమో, నా కోసోమో కాదు అని, ఇది ప్రజల వేదిక అని, దీంట్లో ప్రతిపక్షం, అధికార పక్షం అనే తేడా లేదు అని భావించి, ప్రజల సమస్యలు అధికారులకి చెప్పవచ్చు అనే ఉద్దేశంతో పాల్గున్నాను అని వివరణ ఇచ్చారు... దీనికి సంతృప్తి చెందని లోటస్ పాండ్ వర్గాలు, పార్టీ ఏది చెప్తే అది వినాలి అని, మీకు వెళ్లిపోవాలి అని ఉంటే వెళ్ళిపోండి అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం... అయినా ఉన్న నలుగురుని కాపాడుకోవాలి కాని, ఇలాంటి మాటలు ఏంటో...

Advertisements

Advertisements

Latest Articles

Most Read