ఇవాళ ఐదవ విడత, ‘జన్మభూమి-మాఊరు’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శ్రీకాకుళం జిల్లాలో జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో పాల్గున్నారు... శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురంలో గవర్నమెంట్ కాలేజీ గ్రౌండ్‌లో జన్మభూమి సభను ఏర్పాటు చేశారు. జన్మభూమి సభలో చంద్రబాబు ప్రసంగించారు. అంతకు ముందు ప్రజలతో మాట్లాడించారు... ఈ సందర్భంలో ఒక బాలిక ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది... ఒక్కటి కాదు రెండు కాదు, ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పధకం, ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి, ఆ పాప గుక్క తిప్పుకోకుండా, ప్రసంగించింది...
ఆ పాప మాట్లాడుతూ ఉండగా, చంద్రబాబు, మంత్రి అచ్చెంనాయుడు, మిగతా నాయకులు చప్పట్లు కొడుతూ అభినందించారు... ఆ పాప ప్రసంగం విన్న ప్రతి ఒక్కరూ మెచ్చుకున్నారు... ఈ పాపను చూసి ప్రతి పక్ష నేత జగన్ ఎన్నో విషయాలు తెలుసుకోవాలి అని, ఆ పాపకు తెలిసిన దాంట్లో జగన్ కు కనీసం సగం విషయం కూడా తెలీదు అని అంటున్నారు.. పాదయాత్రలో ఎన్నో అబద్ధాలు చెప్తున్నారు అని, ఈ పాప చెప్పిన విషయాలు అన్నీ తెలుసుకుని, ఏది కరెక్ట్, ఏది తప్పు అనేది తెలుసుకుని జగన్ స్పందిస్తే, ప్రజలకు కూడా మంచిది అని అంటున్నారు...
అంతే కాదు, జగన్ ఒక్కరే కాదు, చాలా మంది తెలుగుదేశం నాయకులు, ఎమ్మల్యేలు, ఎంపీలు కూడా ఈ పాపను చూసి నేర్చుకోవాలి అని అంటున్నారు.. వీళ్ళకు అసలు ఏమి తెలీదు అని, అందుకే ప్రభుత్వం అన్ని మంచి పనులు చేస్తున్నా ప్రజలకి చెప్పలేకపోతున్నారు అని, కనీసం ఈ పాప ప్రసంగం విన్న తరువాత అయినా, ప్రభుత్వం ఎన్ని పనులు చేస్తుందో, ఎంత కస్టపడి ప్రాజెక్ట్ లు పూర్తి చేస్తుందో, ఇవి అన్నీ తెలుగుదేశం నాయకులు తెలుసుకుని, ప్రజలకు చెప్పాలి అని అంటున్నారు... ఆ పాప ప్రసంగం పూర్తి అయిన తరువాత చంద్రబాబు, ఆ పాపను అభినందించి, ఆ పాప తల్లిని కూడా అభినందించారు...