మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ పై, జనసేన పార్టీ తన అభిప్రాయాన్ని చెప్పింది. జనసేన పార్టీ చైర్మన్, రాజకీయ వ్యవహారాల కమిటీ, చైర్మన్, నాదిండ్ల మనోహర్ స్పందించారు. "తెలుగుదేశం శాసనసభ్యుడు శ్రీ అచ్చెన్నాయుడు గారి అరెస్టు అవినీతికి పాల్పడినందుకా? లేదా రాజకీయ కక్ష సాధింపు కోసమా అనే విషయంలో వై.ఎస్.ఆర్.సి.పి. ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. అవినీతి ఏ రూపంలో ఉన్నా దానికి బాధ్యులు ఎంతటి వారైనా జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అయితే అసెంబ్లీ సమావేశాలకు నాలుగైదు రోజుల ముందు శ్రీ అచ్చెన్నాయుడు గారిని అరెస్టు చేయడం సందేహాలకు తావిస్తోంది. అదే విధంగా ఒక శాసనసభ్యుడిని అరెస్ట్ చేసే ముందు రాజ్యాంగ నియమ నిబంధనలను పాటించవలసిన అవసరం ప్రభుత్వంపై ఉంది. శ్రీ అచ్చెన్నాయుడు గారి అరెస్టులో అవి లోపించినట్లు కనిపిస్తున్నాయి. ఈ.ఎస్.ఐ.లో జరిగిన అవకతవకలతోపాటు ఇప్పటి వరకు జరిగిన అన్ని అక్రమాలపై దర్యాప్తు జరిపించాలని జనసేన డిమాండ్ చేస్తోంది" అంటూ నాదిండ్ల మనోహర్, చైర్మన్, రాజకీయ వ్యవహారాల కమిటీ, జనసేన పార్టీ.

ఇది ఇలా ఉంటే, అచ్చెన్నాయుడును ఏసీబీ విజయవాడకు తీసుకువస్తుంది. ఇప్పటికే కృష్ణా జిల్లాలోకి ప్రవేశించినట్టు సమాచారం. విజయవాడకు చేరుకున్న అనంతరం.. అచ్చెన్నాయుడు సహా మిగతా వారికి వైద్య పరీక్షలు చెయ్యనున్నారు. వైద్య పరీక్షల అనంతరం, బస్ స్టాండ్ ఆవరణలో ఉన్న, ఏసీబీ కార్యాలయానికి అధికారులు తీసుకు వెళ్లనున్నారు. అచ్చెన్నాయుడును ఏసీబీ కోర్టులో అధికారులు హాజరుపరచనున్నారు. అచ్చెన్నాయుడు తరలింపు నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు పోలీసులు. అయితే ఇప్పటికే ఏసిబీ జడ్జి ఇంటికి వెళ్ళిపోవటంతో, జడ్జి ఇంటి ముందు హాజరు పరుస్తారా, లేక ఆన్లైన్ లో హాజరు పరుస్తారా అనేది చూడాల్సి ఉంది. అచ్చెన్నాయుడుకు సర్జరీ జరిగిన నేపధ్యంలో, ఆయన్ను రిమాండ్ కు పంపిస్తారా లేక, హాస్పిటల్ లో చేర్పించే విషమై, జడ్జి ఎలాంటి ఆదేశాలు ఇస్తారు అనేది చూడాల్సి ఉంది. అయితే, ఈ రోజు బెయిల్ వచ్చే అవకాసం లేదని, వచ్చే వారమే బెయిల్ వచ్చే అవకాసం ఉందని తెలుస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read