పార్లమెంట్ లో, రాజ్యసభలో టీడీపీ ఎంపీలు చేస్తున్న ఆందోళన పై ఎట్టకేలకు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు... ఇటు రాజ్యసభలోనూ, అటు పార్లమెంట్ లోనూ, జైట్లీ ప్రకటన చేసారు... ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వాల్సిన నిధులను వివిధ మార్గాల్లో సమకూరుస్తున్నామని చెప్పారు.... ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ కార్యదర్శిని త్వరలోనే ఢిల్లీకి పిలిపిస్తున్నామని, ఆ భేటీలో రాష్ట్రానికి రావాల్సిన ప్యాకేజీ విధివిధానాలు రూపిందిస్తామని జైట్లీ తెలిపారు... విదేశీ సంస్థల నుంచి ఏపీ ప్రభుత్వం రుణం తీసుకుంటే కేంద్రం 90 శాతం చెల్లిస్తుందని ఆర్థికమంత్రి పేర్కన్నారు....
రెవెన్యూ లోటు భర్తీపై స్పష్టమైన సూత్రం లేదు. కొత్త ఫార్ములాను రూపొందించడంపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తాం. లోటు భర్తీ కింద ఇప్పటికే రూ.3,900 కోట్లు ఇచ్చాం. ఏపీ విభజన చట్టం హామీల అమలుకు కట్టుబడి ఉన్నాం అంటూ జైట్లీ ప్రకటించారు.... అలాగే రైల్వే జోన్ పై, సంప్రదింపులు జరుగుతున్నాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ రాజ్యసభలో వెల్లడించారు. రైల్వే జోన్‌పై పొరుగు రాష్ట్రాలు అభ్యంతరం చెబుతున్నాయని అన్నారు. రైల్వే జోన్ సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేయాలని మాత్రమే చట్టంలో ఉందని, కాంగ్రెస్ సరిగా చేసి ఉంటే ఈ సమస్యలు వచ్చేవి కావని పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు.
అయితే, వీరిద్దరూ చేసిన ప్రకటనలో ఎక్కడా స్పష్టత లేకపోవటం, పాడిన పాటే పాడటంతో, ఎంపీలు వెనక్కు తగ్గటం లేదు.... హామీల అమలుకు కాలపరిమితి కూడా నియమించాలని డిమాండ్ చేశారు. అయితే ఎంపీల అభ్యర్థనను కేంద్రమంత్రులు తోసిపుచ్చారు. సభలో ప్రకటన చేస్తే మిగతా పార్టీలు కూడా ఇలానే ఆందోళన చేస్తాయని దాటవేత ధోరణితో వ్యహరించారు. ఆర్థికశాఖ కార్యదర్శిని పిలిపించి మాట్లాడతామని కేంద్రమంత్రులు చెప్పుకొచ్చారు. కానీ దీనికి ఎంపీలు అంగీకరించలేదు. హామీల వారీగా ప్రకటన చేస్తేనే ప్రజలు నమ్ముతారని, టెక్నికల్ అంశాలను తెరమీదకు తెస్తే ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరని ఎంపీలు కుండబద్ధలు కొట్టినట్లుగా తెగేసిచెప్పారు.