మొన్నా మధ్య, ఎన్నికలు అయిపోగానే, తిరుపతి వచ్చిన ప్రధాని, ఒక మీటింగ్ పెట్టి, మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళు, ఇంకా బయటకు రాలేదు అంటూ, చంద్రబాబుని ఉద్దేశిస్తూ వెటకారంగా స్పందించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అదే తిరుపతి వచ్చిన కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ కూడా చంద్రబాబు పై వెటకారంగా స్పందించారు. కేంద్రం చక్రం తిప్పుతా అని ప్రగల్భాలు పలికిన వారు ఏమి చెయ్యలేకపోయారు అంటూ చంద్రబాబు ఉద్దేశిస్తూ వ్యంగంగా మాట్లాడారు. చంద్రబాబు గతంలో గెలిచారు అంటే, అది బీజేపీతో ఉండబట్టే అని చెప్పుకొచ్చారు. అంతే కాదు, చంద్రబాబు ఇలా ఓడిపోవటానికి కారణం, మోడీని అకారణంగా దూషించటం అంట. మోడీని చంద్రబాబు తిడుతున్నారు కాబట్టే, చంద్రబాబుని ఘోరంగా ఓడించారు అని కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ చెప్పుకొచ్చారు. అయితే కేంద్ర మంత్రి వ్యాఖ్యలకు తెలుగుదేశం శ్రేణులు వేస్తున్న ప్రశ్నలకు, బీజేపీ వాళ్ళ దగ్గర సమాధానం లేదు.
మోడీతో అకారణంగా గొడవ పడటానికి చంద్రబాబుకు ఏమి పని ? మోడీ, చంద్రబాబుకు ఎమన్నా పొలం తగాదాలు, సరిహద్దు తగాదాలు ఉన్నాయా ? రాష్ట్రానికి మోడీ చేసిన అన్యాయం తట్టుకోలేక, ఆంధ్రప్రదేశ్ కు జరుగుతున్న అన్యాయం పై ప్రశ్నించారు. రెండు జాతీయ పార్టీలో విభజన చట్టం చేసి, పార్లమెంట్ లో చేసిన చట్టం గురించి పట్టించుకోకపొతే, ఆ విషయం పై మోడీని నిలదీశారు. ఢిల్లీకి మించిన రాజధాని కడతాను అంటూ, 1500 కోట్లు మాత్రమే ఇచ్చిన మోడీని నిలదేసారు. కేసుల కోసం, సార్, ప్లీజ్ సార్ ప్లీజ్ అంటూ తెలుగువారి ఆత్మగౌరవం మోడీ ముందు తాకట్టు పెట్టలేదు. అయితే కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ చెప్తున్నట్టు, మోడీతో గొడవ వల్లే, ప్రజలు చంద్రబాబుని ఓడిస్తే, బీజేపీని గెలిపించాలి కాని, జగన్ ను ఎందుకు గెలిపించారు. నోటా కంటే తక్కువ ఓట్లు బీజేపీకి ఎందుకు వచ్చాయి ? ఈ ప్రశ్నకు కేంద్ర మంత్రి గారి దగ్గర సమాధానం ఉందో లేదో మరి ?