జేఎన్టీయూ ప్రాంగణంలోని ఐటీ ఇంకుబేషన్ భవనంలో ఆదివారం కేంద్రమంత్రి ప్రకాష్ జవడేకర్ సెంట్రల్ యూనివర్సిటీ తరగతులను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కేంద్రమంత్రి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ ఎంపీ నిమ్మల కిష్టప్ప ప్రత్యేక హోదా విషయమై కేంద్రమంత్రిని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, కాల్వ శ్రీనివాసులు, పరిటాల సునీత, రిజిస్ట్రార్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ ఎంపీ నిమ్మల కిష్టప్ప ప్రత్యేక హోదా విషయమై కేంద్రమంత్రిని ప్రశ్నించారు. విభజన హామీలు ఏమయ్యాయి అని ఆ స్టేజ్ మీదే, కేంద్ర మంత్రిని నిలదీశారు. జవడేకర్ మాత్రం నవ్వుతూ ఉండి పోయారు.
మరో పక్క, ప్రకాశ్ జవడేకర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి గంటా మాట్లాడుతూ కేంద్ర వర్సిటీలు కేవలం భూమిపూజకు మాత్రమే నోచుకున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ వ్యాఖ్యలను మంత్రి గంటా ఖండించారు. పూర్తిగా అవాస్తవాలు మాట్లాడారని అన్నారు. కేంద్రం కేటాయించిన నిధుల్లో కేవలం 10 శాతం మాత్రమే వచ్చాయని చెప్పారు. 7వర్సిటీలకు 3,508 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించిందని ఆయన తెలిపారు. వర్సిటీలకు ఇచ్చిన నిధులపై కేంద్రం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
దీని పై స్పందించిన, కేంద్రమంత్రి ప్రకాష్ జవడేకర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన 7వర్సిటీలకు వందల కోట్లు ఇచ్చామని అన్నారు. కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేస్తోందని జవడేకర్ అన్నరు. త్వరలో సెంట్రల్ వర్సిటీ భవనాలకు శంకుస్థాపనలు చేస్తామని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. మొత్తానికి, ఏపి వచ్చిన కేంద్రం మంత్రికి ప్రజల ముందే, నిలదీశారు, తెలుగుదేశం ఎంపీ, మంత్రి. ప్రకాష్ జవడేకర్ మాత్రం, అందరి బీజేపీ నాయకుల లాగే, అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా, అన్నీ ఇచ్చేసాం, ఇవి ఇచ్చాం, అవి ఇచ్చాం, అయినా రాష్ట్ర ప్రభుత్వం రాజకీయం కోసం విమర్శలు చేస్తుంది అని చెప్పి తప్పించుకున్నారు.