నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైసిపీ అభ్యర్ధిగా పోటీ చేసే ఆలోచనలో ప్రముఖ సినీనటి జయప్రద ఉన్నట్టు సమాచారం. తొలత తెలుగుదేశం రాజ్యసభ సభ్యురాలుగా రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగారు. తరువాత చంద్రబాబుకు దూరమై ఉత్తరప్రదేశ్ లోని సమాజ్ వాదీ పార్టీ తరుపున రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు. సమాజ్ వాదీ పార్టీలో వచ్చిన నాయకత్వ మార్పులు కారణంగా తిరిగి స్వంత రాష్ట్రం నుంచి పోటీ చేయాలన్న తలంపుతో వైసిపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని కలిసి రాజమండ్రి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరినట్టు తెలుస్తుంది.
రాజమండ్రి స్థానం పై జగన్ స్పష్టమైన హామీ ఇవ్వకపోవటంతో జయప్రద సన్నిహితులు నరసరావుపేట నుంచి పోటీ చేస్తే విజయావకాశాలు ఎలా ఉంటాయి అన్న దాని పై సొంత టీంతో సర్వే నిర్వహించినట్టు, సర్వేలో తనకు సానుకూలంగా స్పందన వచ్చినట్టు చెప్తున్నారు. దీంతో రానున్న ఎన్నికల్లో నరసరావుపేట వైసీపీ ఎంపీగా బరిలోకి దిగేందుకు సన్నహాలు చేస్తున్నట్టు చెప్తున్నారు. ఇదే సర్వే రిపోర్ట్ పట్టుకుని, జగన్ వద్దకు వెళ్లినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ కూడా జగన్ సరైన భరోసా ఇవ్వలేదని తెలుస్తుంది. నేను కూడా నా వైపు నుంచి సర్వే చేపిస్తాను, అప్పుడు చూద్దాంలే అని చెప్పినట్టు సమాచారం.
అయితే జగన్ మరో ప్రోపోజల్ కూడా జయప్రద ముందు ఉంచారు. మీరు ముందు పార్టీలో చేరండి, ప్రచారం మొదలు పెట్టండి, మీ గ్లామర్ మా పార్టీకి అవసరం అని చెప్పినట్టు సమాచారం. అయితే, దీని పై జయప్రద సుముఖంగా లేరని, ముందు ఎదో ఒక పార్లమెంట్ స్థానం ఓకే చేసి,బహిరంగంగా ప్రకటిస్తే కాని, పార్టీలో చేరేది లేదని తేల్చి చెప్పినట్టు సమాచారం. ఇవన్నీ పరిశీలిస్తున్న తెలుగుదేశం పార్టీ మాత్రం, చాలా సంతోషంగా ఉంది. జయప్రద లాంటి వారిని ఓడించటం చాలా తేలిక అని, ఇలాంటి గ్లామోర్ లు, ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు పని చెయ్యవని, మన తరుపున పోరాడేవారు ఢిల్లీలో ఉండాలి అనే మూడ్ ప్రజల్లో ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో జయప్రద పోటీ చేస్తే, మాకు ఒక ఎంపీ సీట్ ఎన్నికలు జరగక ముందే గెలిచినట్టే అని అంటున్నారు.