అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి ఈ రోజు పోలీసులు చుక్కలు చూపించారు. పోలీసుల పై అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ జేసీ పై కేసు నమోదు అయ్యింది. దీంతో ఆయాన ముందస్తు కేసుల కోసం, అనంతపురం రూరల్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. అయితే జేసీ దివాకర్ రెడ్డికి బెయిల్ ఇవ్వకుండా, పోలీసులు దాదాపుగా 7 గంటల పాటు ఆయన్ను స్టేషన్ లోనే ఉంచారు. దీంతో ఆయనకు బెయిల్ ఇవ్వరేమో అని, ఆయన్ను అరెస్ట్ చేస్తారేమో అని అందరూ అనుకున్నారు. దీంతో ఒక్కసారిగా అనంతపురంలో వాతావరణం వేడెక్కింది. పెద్ద ఎత్తున తెలుగుదేశం కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ముందుకు చేరుకున్నారు. ఒక కార్యకర్త ఒంటి పై పెట్రోల్ పోసుకోవటంతో, ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో, పోలీసులు లాఠీ చార్జ్ చేసి, కార్యకర్తలను చెదర గొట్టారు. అయితే అక్కడ ఉన్న మీడియా పై కూడా పోలీసులు చిందులు తొక్కారు. ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని మీడియాకు చెప్పటంతో, మీడియాకు, పోలీసులకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది.

jc 04012020 2

మరో పక్క టీడీపీ నేతలు పార్థసారథి, రఘునాథరెడ్డి, ఈరన్న, పోలీస్ స్టేషన్ ముందే చాలా సేపు నుంచున్నారు. వారిని లోపలకు పంపలేదు. ఇది ఇలా ఉంటే, 7 గంటలు దాటిన తరువాత జేసీకి స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేసారు. తరువాత జేసీ మీడియాతో మాట్లాడుతూ, జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు 15 ఏళ్ళు చేసాడు, రాజశేఖర్ రెడ్డి 6 ఏళ్ళు చేసాడు కాని, ఎప్పుడూ ఇలా ప్రత్యర్ధులను వేధించలేదని, ఇతడు మాత్రం హద్దులు దాటి ప్రవర్తిస్తున్నాడని అన్నారు. ఈ సంస్కృతీ ఇలాగే కొనసాగితే, డబ్బులు ఇచ్చి ఎన్నికలకు వెళ్తున్నట్టు, ఇది కూడా దేశం అంతా పాకుతుందని, అందుకే వెంటనే ప్రధాని మోడి రంగంలోకి దిగి, అవసరం అయితే, జగన్ ను బర్తరఫ్‌ చేయాలంటూ, సంచలన వ్యాఖ్యలు చేసారు.

jc 04012020 3

కోర్టు బెయిల్‌తో పీఎస్‌కు వెళ్తే, 7 గంటలు లోపల పెట్టుకున్నారని, బీపీ, షుగర్ ఉందని చెప్పినా పోలీసులు వదల్లేదని, మందులు లేకుండా, భోజనం లేకుండా ఇబ్బంది పెట్టారని అన్నారు. పోలీసు అధికారులపై రిమోట్ శక్తి బాగా పని చేస్తోందని, కాని ప్రతి ఆక్షన్ కు, రియాక్షన్ ఉంటుంది అనే విషయం గుర్తుంచుకోవాలని అన్నారు. నేనే బెయిల్ ఆర్డర్ తీసుకుని స్టేషన్ కు వెళ్లానని, అది చూసి పంపేయవచ్చని, కాని, ఇలా ఇబ్బంది పెట్టారని అన్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని, ఇలాగే ఇంకా ఇంకా ఇబ్బందులు పెడతారని, అందరూ మానసికంగా సిద్ధం కావలని అన్నారు. తనని ఇబ్బంది పెడుతున్నారని, తెలుసుకుని, తెలుగుదేశం కార్యకర్తలు, నాయుకలు, వచ్చి తనకు సంఘీభావం తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read