రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం పై, కేంద్ర మంత్రి వర్గం నుంచి రాజేనామాలు చెయ్యలాని నిర్ణయం తీసుకోవటంతో, ఢిల్లీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి... నిన్న రాత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన చేసిన వెంటనే, వైసిపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఆ చర్యను కూడా విమర్శించారు... కేంద్రకేబినెట్ నుంచి టీడీపీ మంత్రులు రాజీనామా చేయడం ఓ డ్రామా అన్నారు వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. వారిపదవులకోసం నాలుగేళ్ళుగా రాష్ర్ట ప్రయోజనాలను తాకట్టుపెట్టారని తీవ్రంగ మండిపడ్డారు. రాజీనామాలంటూనే... ఈ వ్యాఖ్యల పై, విమర్శలు కూడా వచ్చాయి... రాష్ట్రం కోసం చేస్తున్న పనులుకి కూడా రాజకీయం ఏంటి అంటూ, విమర్శలు వచ్చాయి...
అయితే, ఈ రోజు ప్రతి రోజు లాగానే, వైసిపీ ఎంపీలు పార్లమెంట్ లో ఆందోళన చేస్తున్నారు... ప్లే కార్డులు పట్టుకుని, వైసిపీ ఎంపీలు ధర్నా చేస్తున్న సమయంలో, జేసి దివాకర్ రెడ్డి వాళ్ళ దగ్గరకు వచ్చి, నిన్న నువ్వు మాట్లింది ఏంటయ్యా అంటూ రాయలసీమ యాసలో, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని ప్రశ్నిస్తూ, మీకు దమ్ము ఉంటే ఏప్రిల్ 6 కాదు, ఇప్పుడు రాజీనామా చెయ్యండి, మేము రాజీనామా చేస్తాం..మళ్ళీ పోటీ చేద్దాం, ఎవరు గెలుస్తారో చూద్దాం అంటూ, నీకు దమ్ము ఉందా అంటూ, మీసం మెలేసి, తొడ కొట్టి, సవాల్ చేస్తూ, వారిని రమ్మంటూ ఛాలెంజ్ చేసారు..
అంతే కాదు, మీరు ఫోటోలకి ఫోజులు ఇవ్వటం తప్ప, మీరు మీ నాయకుడు చేసేది ఏమి లేదు అని ఎద్దావా చేసారు.. ఈ సమయంలో పార్లమెంట్ సిబ్బంది ఏమన్నా గొడవ అవుతుంది ఏమో అని ఖంగారు పడ్డారు... అయితే, దివాకర్ రెడ్డి అక్కడ నుంచి పార్లమెంట్ కు వెళ్ళిపోయారు... అయితే నిన్న అరుణ్ జైట్లీ స్పష్టంగా ప్రకటన చెయ్యగానే, చంద్రబాబు తన మంత్రుల చేత రాజీనామా చేపించారు... ఇంత స్పష్టంగా చెప్పినా, జగన్ మాత్రం, ఏప్రిల్ 6 వరకు రాజీనామా చేసేది లేదని చెప్పటం, ఆశ్చర్యంగా ఉందంటూ విశ్లేషకులు చెప్తున్నారు...