అందరూ అనుకున్నట్టే జేసీ దివాకర్ రెడ్డికి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. తన పై కక్ష తీర్చుకోవటానికి ప్రభుత్వం చూస్తుందని, నిన్న జేసీ దివాకర్ రెడ్డి చెప్పిన, 24 గంటల్లోనే జేసీకి షాక్ ఇచ్చింది ప్రభుత్వం. ఆయనకు ఉన్న మైనింగ్ పై, మైనింగ్ శాఖ అధికారులు చర్యలు మొదలు పెట్టారు. దివాకర్ రెడ్డి పైన కేసు నమోదు చేసారు. నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ నిర్వహించటంతో పాటుగా, గనుల్లో కార్మికుల బద్రతను గాలికి వదిలేసారని, జేసి కుటుంబం పైన, వాళ్ళ కుటుంబం పైనా, అధికారులు అభోయోగాలు మోపారు. ఇందుకు సంబంధించి నోటీసులు కూడా జారీ చేసారు. ఈ నోటీసులకు సంబంధించి, తమకు ఎలాంటి ఒత్తిడులు కానీ, ఎలాంటి దురుద్దేశాలు తమకు లేవని గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎస్వీ రమణా రావు వివరించారు. కేవాలం గనులును నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించటం వల్లే నోటీసులు ఇచ్చామని తెలిపారు. దీని పై ఉన్నతాధికారులకు సమాచారం పంపి, మరిన్ని చర్యలు తీసుకుంటామని, గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమణా రావు చెప్పారు. అనంతపురం జిల్లా ముచ్చుకోట వద్ద అటవీ ప్రాంతంలో జేసి కుటుంబానికి రెండు మైనింగ్ కంపెనీలు ఉన్నాయి. ఆ గనుల్లోనే శుక్రవారం నాడు తనిఖీలు చేసారు తెలుస్తుంది.
దీంతో అప్పుడే నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ చేసినట్టు గుర్తించామని చెప్తున్నారు. ఇవి డోలమైట్ ఖనిజానికి సంబందించిన గనులు. తనిఖీలు తరువాత అక్కడ, నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ జరుగుతున్నట్టు చెప్పారు. అయితే ఇదే విషయం పై జేసీ దివాకర్ రెడ్డి నిన్నే, ఈ విషయం పై ఫైర్ అయ్యారు. గనుల శాఖ కార్యాలయం వద్దకు వచ్చి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఈ నియంత పాలన ఎంతో కాలం ఉండదని, తరువాత మేము వచ్చి, మాకు చేసిన సన్మానం కంటే, రెట్టింపు సన్మానం ఉంటుందని, ఎవరినీ మరచిపోమని అన్నారు. తమకు అన్నం పెట్టేది ఈ గనులు అని, ఇవి మూసివేస్తే తాము రోడ్డున పడతామని, అన్నం లేకుండా చేయాలనీ, ఆర్ధికంగా దెబ్బ కొడుతున్నారని జేసి నిన్న మీడియాతో తెలిపారు. తన సోదరుడు పై కక్ష తీర్చుకున్నారని, ఇప్పుడు తన పై పడ్డారని, అన్నిటికీ సమాధానం చెప్పే రోజు తొందర్లోనే వస్తుందని, రాజకీయ దురుద్దేశంతో, ఇలా వేధించటం ఎప్పుడూ చూడలేదని, అందరి లెక్కలు తెల్చుతామని జేసి అన్నారు. ముందు ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.