కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ గురువారం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై తెలుగుదేశం పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనదైనశైలిలో కామెంట్స్ చేశారు. బడ్జెట్‌పై మీ స్పందనేంటని ఢిల్లీలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. బడ్జెట్టూ లేదూ వంకాయ లేదు.. పోవయ్యా ఫో.. అంటూ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత రైల్వే జోన్‌పై మీ కామెంట్ ఏంటని ప్రశ్నించగా.. రైలు లేదు, జోన్ లేదు అంటూ, తాడిపత్రికి విమాన జోన్ మాత్రం వస్తుందని ఆయన వ్యంగ్యంగా ఉన్నారు.అభివృద్ధిలో భాగంగా తాడిపత్రిలో విమాన జోన్ ఏర్పాటు చేసి అన్ని విమానాలు దిగేలా చేస్తారంటూ సెటైర్లు వేశారు.

diwarkar 010222018 2

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీకి మూడు నామాలు పెట్టినట్టుందని తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్థాయిని మరిచి.. కేంద్రం చుట్టూ తిరిగినా ప్రయోజన లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు... టీడీపీ మాత్రమే కాదని దేశంలోని అన్ని పార్టీలకు ఈ బడ్జెట్‌పై నిరాశ, నిస్పృహ ఉందన్నారు. ఏపీకి ఎటువంటి ప్రత్యేక నిధులు ఇవ్వడం లేదని, అతి తక్కువగా నిధులు ఇచ్చి సాయం చేశామన్నామంటే ఎలా అని ప్రశ్నించారు.

diwarkar 010222018 3

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి చాలా సహనం ఉందని ఆయన ఎంతో ఓపికగా ఉన్నారని వ్యాఖ్యానించారు. చివరకు పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చిన హామీలపై, తిరుపతి వేంకటేశ్వర స్వామి సాక్షిగా ఇచ్చిన హామీలపై కూడా కేంద్ర బడ్జెట్‌లో న్యాయం చేయలేదని జేసీ దివాకర్ రెడ్డి వాపోయారు. బడ్జెట్‌ తెలుగువారి ఆత్మగౌరవాన్ని కించపర్చేలా ఉందని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. కాగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ఏపీ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఏపీ బీజేపీ నేతలు మాత్రం బడ్జెట్‌‌లో రాష్ట్రానికి ఎలాంటి నష్టం జరగలేదని చెబుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read