వైసీపీ అధినేత జగన్.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు జేసీ దివాకర్‌రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఓ గ్రామానికి వెళ్లిన జేసీ స్థానికులతో అరుగుపై కూర్చొని ముచ్చటించారు. ఈ సందర్భంలో జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో ఆలస్యంగా బయటపడింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో జేసీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. జగన్ తనకు చిన్నప్పటి నుంచి తెలుసన్నారు జేసీ. లండన్‌లో చదువు కోసం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పంపిస్తే.. జగన్ తిరిగొచ్చేశారని చెప్పుకొచ్చారు. తిరిగొచ్చాక పంచాయితీలు ఎక్కువకావడంతో.. జగన్ గురించి వైఎస్ తన దగ్గర చెప్పి బాధపడేవారన్నారు.
అందుకే ఆయన్ను బెంగళూరు పంపించేశారన్నారు. జగన్‌కు అన్నీ తాత బుద్దులేనన్నారు. తనను రూ. 35 కోట్లు ఇవ్వమని అడిగారని.. జగన్‌కు తనా, మనా భేదం లేదన్నారు. చంద్రబాబుపై వ్యాఖ్యల విషయానికొస్తే.. చంద్రబాబులో కమ్మదనం ఉందని.. వారిపై కొంత ప్రేమ ఉన్నా.. అందరినీ సమానంగా చూసే వ్యక్తే.. కాస్తంత మంచితనం కూడా ఉందన్నారు. ఆ వైఖరి సరైనదే.. అలాగే ఉండాలని అభిప్రాయపడ్డారు. ఆయన నీళ్లు తేకుంటే.. తాను ఎప్పుడో పార్టీకి గుడ్ బై చెప్పేసేవాడ్ని అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో రైతులకుమేలు జరిగిందని.. ప్రతి ఎకరాకు నీరందించేందుకు చంద్రబాబు పడిన తపనను చూశానన్నారు.
"మీరెన్నైనా చెప్పండి... కమ్మోడు... కమ్మ నా... కొడుకు ఇవన్నీ ఉన్నాయి. నీళ్ల విషయంలో ఆయనకు కమ్మ లేదు కాపు లేదు. కష్టపడి పని చేస్తాడు. వాడు గనుక నీళ్లు తేకుంటే నేను ఎన్నడో గుడ్ బై చెప్పేసేవాడిని. పోయిన ఎలక్షన్స్ లో ఒక్క పైసా ఇవ్వలా. ఇప్పుడు ఎలక్షన్స్ లో ఆ నా... ఒక్కపైసా ఇవ్వలా. నేనే... చెబితే ఎవరూ నమ్మరు. నేనే ఖర్చు పెట్టా. ఇంతకుముందు పెట్టా. ఇప్పుడూ పెట్టా" అని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇటీవల తన నియోజకవర్గ ప్రజలతో మాట్లాడిన ఆయన, చంద్రబాబులో కమ్మ కులపు వారిపై కొంత ప్రేమ ఉన్నా, అందరినీ సమానంగా చూసే వ్యక్తేనని, కాస్తంత మంచితనం కూడా ఉందని అన్నారు. చంద్రబాబు వైఖరి సరైనదేనని, అలాగే ఉండాలని అభిప్రాయపడ్డారు. జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యల వీడియోను మీరూ చూడవచ్చు. https://youtu.be/K3ZTC02_wxw