‘‘వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కోడి కత్తి గా యం ఓ డ్రామా. కోడికత్తి గాకుండా ఎవడైనా పెద్ద కత్తి తో జగన్‌కు చిన్న గాయం చేసినా మా చంద్రబాబు కొంప మునిగేది. అక్కడ కూడా వైసీపీ వాళ్ల తెలివి పనిచేయలేదు. అంత తిక్క వ్యక్తి జగన్ సీఎం అయితే ఇక అంతే’’ అని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. హంద్రీ-నీవా ప్రాజెక్టు 36వ ప్యాకేజీ కాలువలపై శాసనమండలి చీఫ్‌విప్ పయ్యావుల కేశవ్ చేపట్టిన రెండు రోజుల పాదయాత్ర ముగింపు సందర్భంగా ఆదివారం ఉరవకొండ నియోజకవర్గం బెళుగుప్ప మండలం శీర్పి చెరువులో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా ప్రజలు మరచిపోతారని, అయితే సాగునీరందిస్తే మాత్రం ఏళ్లకాలం గుర్తు పెట్టుకుంటారన్నారు.
‘‘మా వాడు జగన్.. పేరుకు రెడ్డే కానీ రెడ్లకుండే దాతృత్వం లేదు. జగన్..! ఇప్పుడు కూడా నేను నీ మేలు కోరేవాడినే. నీకు ఇద్దరు కూతుళ్లున్నారు. చ క్కగా ఫ్యాక్టరీలున్నాయ్.. లక్షణంగా బతుకు. నేనే ఎన్నికల్లో పోటీ చేయకుండా రమించుకోవాలనుకుంటున్నా. కానీ చంద్రబాబు మరో పదే ళ్లు.. కనీసం ఐదు సంవత్సరాలు సీఎంగా ఉంటేనే అనంతపురం జిల్లా సస్యశ్యామలమవుతుంది. వచ్చే ఎన్నికల్లో 30 శాతం అభ్యర్థులను మార్చకపోతే చంద్రబాబుకు అధికారం గోవిందా. ఆయన ముందుచూపు న్న నాయకుడు. సీఎం కావాలనుకునే వ్యక్తి రాష్ట్ర ప్రజలంతా బాగుండాలని కోరుకుంటారు. జగన్‌కు కామన్సెన్స్ లేదు. పట్టిసీమను చంద్రబాబు తీసుకొస్తే దాన్ని వద్దనేవాడుంటాడా? దశాబ్దాల కిందటే నిపుణులు ఈ రాష్ట్రంలో సాగునీటి సమస్య పరిష్కారానికి నదుల అనుసంధానమే మార్గమని సూచించారు.
దాన్ని అమలు చేసి చూపించిన ఏకైక నాయకుడు చంద్రబాబు. జిల్లాలో నిర్మించిన బీటీపీకి నీరెప్పుడొస్తుందిరా.. అని మా నీలం సంజీవరెడ్డి అనేవాడు. ఆయన కలను ఇప్పుడు నిజం చేయబోతున్నారు. ఎవరూ ఊహించని విధంగా గోదావరి, కృష్ణా నదులను చంద్రబాబు అనుసంధానం చేశాడు’’ అన్నారు. నదుల అనుసంధానంతో రాష్ట్రంలోని రైతాంగాన్ని సాగునీటి ప్రాజెకుల ద్వారా ఆదుకోవడానికి నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలోని బీటీపీకి నీరందించేందుకు గతనెలలో భూమిపూజ చేశారన్నారు. అంతేగాకుండా ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలను అందించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు.