ప్రస్తుతం దేశంలో అన్ని ప్రాంతీయ పార్టీలను పతనం చేసే ఆలోచనలో బీజేపీ ఉన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు పై అదే కుట్ర చేసి, ఓడించారు. మమతా బెనర్జీ పని పట్టి, ఇప్పటికే ఆమె పై, పై చేయి సాధించారు. గత వారం రోజులగా, తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసిన విషయం కూడా చూస్తున్నాం. త్వరలోనే పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పై రాజకీయ దాడికి బీజేపీ రెడీ అవుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ పై కూడా తన ఫోకస్ పెట్టింది. నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చినా, ప్రస్తుతానికి జగన్ ని అడ్డు పెట్టుకుని, ఎదిగే ఆలోచనలో ఉంది. అందుకే తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసి, సీనియర్ నాయకులను లాగేస్తుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయం పై, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి వెళ్ళిన ఆయన, అక్కడ లాబీలకు వెళ్లి జేసీ తాజా రాజకీయాల పై మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చారు.

బీజేపీలో చేరాలంటూ తనకు కూడా ఫోన్ చేసి ఆఫర్ ఇచ్చారని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. కొందరు బీజేపీ పార్టీ నేతలు తనతో టచ్‌లో ఉన్నారని, కానీ తాను రాజకీయాలకు గుడ్ బై చెప్పానని, అలాంటప్పుడు పార్టీ ఎలా మారతానని వారిని ప్రశ్నించినట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో పార్టీ బలోపేతానికి బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తుంటారని, అందులో ఎలాంటి తప్పు లేదన్నారు. ఇంకా కొందరు నేతలు బీజేపీతో టచ్‌లో ఉన్నారనేది వాస్తవమేనని జేసీ దివాకర్ రెడ్డి బాంబు పేల్చారు. ఎన్నికల ఫలితాల వచ్చిన అనంతరం బీజేపీలోని కొంత మంది నేతలు ఎవరూ తనను సంప్రదించలేదని పుకార్లకు జేసీ శుభం కార్డు పలికారు. అయితే బీజేపీకి కొందరు నేతలు టచ్‌లో ఉన్నారన్న వ్యవహారం పై టిడిపి కార్యకర్తలు మాత్రం పోజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇప్పుడున్న కొంత మంది సీనియర్లు, పార్టీకి భారమని, ఇలా అయినా వారు వదిలిపోతే అంతకంటే సంతోషం ఏముంటుంది అంటున్నారు. మరి ఈ వ్యవహారం పై చంద్రబాబు ఏమంటారో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read