తెలుగుదేశం అధ్యక్ష్యుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ రోజు అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటనలో ఉండనున్నారు. తెలుగుదేశం పార్టీ పై, జిల్లాలోని వివిధ నియోజకవర్గాల పై సమీక్ష చెయ్యనున్నారు. ఈ సందర్భంగా, మొదటి రోజు, చంద్రబాబు ప్రసంగానికి ముందు, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, మాట్లాడారు. జీసీ మాట్లాడుతూ, కుండ బద్దులు కొట్టేలా వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు గారు, మీరు మా జిల్లాకు వచ్చినందుకు సంతోషం, అంటూనే, పార్టీలో ఉండే సమస్యలు, చంద్రబాబు వైఖరి పై కుండబద్దలు కొట్టారు. ఇది నా అభిప్రాయం కాదని, ఇది కార్యకర్తల అభిప్రాయం కూడా అని చెప్పారు. చంద్రబాబు గారు, మీకు జగన్ ఏమైనా, కొడుకా, తమ్ముడా, బంధువా, అతని గురించి కొన్నాళ్ళు వదిలేయండి, ఎన్ని చేస్తాడో చెయ్యనివ్వండి, ప్రతి రోజు మీరు ఏదో ఒక విధంగా ప్రజల ముందుకు వస్తున్నారు, అసలు కొన్నాళ్ళు మీరు ఎక్కడా కనిపించికండి, మీరు ఎక్కాడా మాట్లాడకండి, హాయిగా పార్టీ పనులు చూసుకోండి అని చెప్పారు.

jc 18122019 2

ఇక అలాగే చంద్రబాబు వైఖరి పై చెప్తూ, మా వాడు, రాజశేఖర్ రెడ్డి కాదు, తాత రాజా రెడ్డి పోలిక అని మీకు రెండేళ్ళ క్రితమే చెప్పను. ఇప్పుడు జరుగుతుంది చూస్తున్నారు కదా. మమ్మల్ని ఆడుకుంటున్నాడు. అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. కానిస్టేబుల్ గాడు కూడా మమ్మల్ని బెదిరుస్తున్నారు. ఇక్కడ ఉన్న పోలీసులు అందరికీ చెప్తున్నా, మీరు మాలాగా 5 ఏళ్ళకే వెళ్ళిపోరు, మళ్ళీ మేము వస్తాం, మీరు శ్రీకాకుళంలో ఉన్నా మీ సంగతి చూస్తాం. జాగ్రత్తా అని వార్నింగ్ ఇస్తూ, ఇదే సందర్భంలో చంద్రబాబు గారికి కూడా ఒక సూచన అంటూ జేసీ చెప్పుకొచ్చారు. అయ్యా, మీరు గాంధీలాగా ఉంటే కుదరదు, మీకు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా, మీ శాంతి మంత్రం పక్కన పెట్టండి. మాలాంటి వారిని కూడా శాంతి శాంతి అంటూ కట్టడి చెయ్యకండి, మీకు దండం పెడుతున్నా అంటూ జేసీ చెప్పుకోచ్చారు.

jc 18122019 3

అంతే కాదు మా వాడిలో ఒక మంచి గుణం ఉంది. 15 నిమిషాల్లో అంతా పూర్తీ చేస్తాడు. మీరేమో, ఆ సమీక్ష ఈ సమీక్ష అంటూ గంటలు గంటలు మాట్లాడుతూనే ఉంటారు. ఇది కూడా పక్కన పెట్టండి. ఇది మా సూచన. ఇప్పుడు ఈ జిల్లలో ఉన్న ఎమ్మెల్యేలను చూస్తుంటే భయం వేస్తుంది. గతంలో మన పార్టీ వారి పైనే నేను విమర్శలు చేశాను కాని, వీళ్ళతో పోల్చుకుంటే మన వాళ్ళు వందల రెట్లు నయం, మన వారికి నేను హాట్స్ అఫ్ చెప్పాలి అంటూ, జేసీ చెప్పారు. చివరగా ఒక మాట, మీరు మాత్రం ఆ శాంతి మంత్రం పక్కన పెట్టి, గట్టిగా ఉండాల్సిన సమయం వచ్చింది అంటూ జేసీ చెప్పి ముగించారు. జేసీ మాటలకు, కార్యకర్తలు కూడా గట్టిగా చప్పట్లు, ఈలలు కొడుతూ, ఆయన మాటలకు మద్దతు పలికారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read