అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. తాడిపత్రిలోని పెద్దపప్పూరు ఇసుక రీచ్ వద్ద అక్రమాలు జరుగుతున్నాయి అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి రీచ్ కు వెళ్లి నిరసన తెలిపారు. ఇసుక రీచ్ లో కూర్చుని నిరసన తెలుపుతున్నారు. కేవలం మూడు అడుగులే ఇసుక తవ్వాలని నిబంధనలు ఉన్నాయిని, అయితే 20 అడుగుల లోతు తవ్వి రాత్రిబవళ్లు ఇసుక తరలిస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా పెన్నా నదిలో గోతులు తవ్వుతున్నారని జేసీ నిరసనకు దిగారు. అయితే నిరసన విరమించుకోవాలని జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసుల హుకుం జారీ చేయటంతో, పోలీసులు, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వాగ్వాదం చేసుకుంది. దీంతో పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. వాహనం నుంచి జేసీ గన్ మెన్ ను కూడా దించేవేసిన పోలీసులు, జేసీ ప్రభాకర్ రెడ్డిని వాహనంలో పలు చోట్లకు తిప్పుతున్నారు. దీంతో తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
గన్ మెన్ ని కూడా దించేసి, జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిన పోలీసులు... తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత
Advertisements