తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసి ప్రభాకర్ రెడ్డి పై మరో కేసు నమోదు అయ్యింది. నిన్న తాడిపత్రిలో జరిగిన ఎమ్మెల్యే కేతిరెడ్డి దా-డి నేపధ్యంలో, బాధితులైన మాజీ ఎమ్మెల్యే జేసి ప్రభాకర్ రెడ్డి పైనే కేసు నమోదు కావటం అందరినీ ఆశ్చర్య పరిచింది. జేసీ దివాకర్ రెడ్డి ఆయన కొడుకు అస్మిత్ రెడ్డి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. ఇందుకు సంబంధించి తాడిపత్రి వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసారు. నిన్న జరిగిన ఘటన ఏమిటి అంటే, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పెద్ద ఎత్తున అనుచరులను వెంట పెట్టుకుని వెళ్లారు. ఇందుకు సంబంధించిన సిసి ఫూటేజ్ పరిశీలించి, సుమోటోగా కేసు నమోదు చేయాలని, జేసీ ప్రభాకర్ రెడ్డి నిన్న మీడియాతో చెప్పారు. అయితే ఆ కోణంలో కాకుండా, మరో కోణంలో అలోచించి కేసు పెట్టిన పోలీసులు, జేసీ ప్రభాకర్ రెడ్డి పైనే ఎదురు కేసు పెట్టటంతో, జేసి వర్గీయులు షాక్ తిన్నారు. నిన్న కయ్యానికి కాలు దువ్వింది, ఏకంగా జేసీ ఇంటికి వెళ్లి వీరంగం సృష్టించింది, కేతిరెడ్డి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం చూసింది. ఎదో సినిమాల్లో చూసినట్టు, కార్లు ఫాస్ట్ గా వచ్చి ఆగటం, అందులో నుంచి దిగటం, రాడ్డులు పట్టుకుని లోపలకి వెళ్ళటం, ఇవి అందరూ చూసారు. అయితే ఇప్పటి వరకు వాళ్ళ పైన మాత్రం ఒక్క కేసు కూడా నమోదు కావటం లేదు.
అయితే దా-డి-కి ప్రతిగా, రోడ్డు పైకి వచ్చిన జేసీ వర్గీయులు పై కేసులు పెట్టటం పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు,జేసి వర్గీయులు. నిన్న జరిగిన ఘ-ర్ష-ణ-లో జేసీ ప్రభాకర్ రెడ్డి మనుషులు, కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరుడు అయిన మనోజ్ అనే వ్యక్తిని కొ-ట్టా-ర-ని, అతను ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి కావటంతో, జేసి ప్రభాకర్ రెడ్డి పై, అతని ప్రధాన అనుచరుల పై కూడా కేసు నమోదు అయ్యింది. అయితే ఈ ఘటనకు ప్రధాన కారణం అయిన తాడిపత్రి ఎమ్మెల్యే కానీ, అతని అనుచరుల పై కాని ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. జేసీ వర్గీయులు దా-డి చేస్తే వారి పై కేసు పెట్టటంలో తప్పు లేదు కానీ, ఆసలు తప్పు చేసిన వైసీపీ ఎమ్మెల్యే పై మాత్రం, ఇప్పటి వరకు ఎలాంటి కేసు లేకపోవటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరి పోలీసులు అన్నీ సమీక్ష చేసి, వీరి పై కూడా కేసులు పెడతారో లేదో చూడాలి. అయితే తెలుగుదేశం నేతలు మాత్రం, ఈ పరిణామం పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ రాజ్యంలో తమకు న్యాయం జరగదని, అందుకే ఇప్పటికీ మేము ఏ కేసు పెట్టలేదని, మాకు న్యాయం జరగదని అంటున్నారు.