నిన్న కడప జిల్లా సెంట్రల్ జైలు నుంచి విడుదల అయిన, టిడిపి మాజీ ఎమ్మెల్యేకి మరో షాక్ తగిలింది. ఆయన పై ఈ రోజు మరో మూడు కేసులు నమోదు చేసినట్టు తెలుస్తుంది. కడప జైలు నుంచి దాదపుగా 50 రోజులు తరువాత, జేసి ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి విడుదల అయ్యారు. అయితే నిన్న కడప సెంట్రల్ జైలు నుంచి, తన అనుచరులతో అనంతపురం వెళ్ళారు. ఈ సమయంలో, వారు, వారితో పాటు ఉన్న మరి కొంత మంది తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల పై పోలీసులు కేసు నమోదు చేసారు. అయితే అక్కడతో అయిపోలేదు. జేసీ ప్రభాకర్ రెడ్డి, తాడిపత్రి సిఐ పై, దురుసుగా ప్రవర్తించారని, మరో కేసు కూడా పెట్టారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో ఒక ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టినట్టు తెలుస్తుంది. ఈ రోజు జేసి ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలు, తమకు ఇచ్చిన కండీషనల్ బెయిల్ లో భాగంగా, ఈ రోజు ఉదయం అనంతపురంలో ఉన్న వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు సంతకాలు చేసేందుకు వచ్చారు.

అయితే సంతలకు పూర్తి అయినా కూడా, ఇంకా వారిని విడుదుల చెయ్యకపోవటం, మరో పక్క తాడిపత్రి పట్టణంలో పోలీస్ బలగాలు పెంచటంతో పాటుగా, వజ్ర వాహనం కూడా రావటంతో, మళ్ళీ జేసి అరెస్ట్ తప్పదని, అందులో భాగంగానే, పోలీసులు ఈ ఏర్పాటు చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపధ్యంలో మరో సారి తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు, జేసి అనుచరులు, స్టేషన్ కు చేరుకుంటున్నారు. రాజకీయంగా కక్ష సాధిస్తున్నారని, కోర్టు బెయిల్ ఇచ్చిన తరువాత, మరో కేసు పెట్టటం ఏమిటి, కావాలనే ఇలా కేసులు పెడుతున్నారు అంటూ, తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. మరి జేసిని ఈ కేసులో అరెస్ట్ చూపిస్తారా ? లేక విచారణ చేసి వదిలేస్తారా అనేది చూడాల్సి ఉంది. మొత్తానికి, జేసి కుటుంబానికి మాత్రం కష్టాలు తప్పటం లేదు. రాజకీయంగా ఎంత వరుకు అయినా రెడీ అని, పార్టీ మారే పరిస్థితి లేదని చెప్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read