వైసిపీ ప్రభుత్వం వచ్చిన రెండు నెలలుగా రాజకీయ కక్ష సాధింపులు పెరిగిపోయాయి. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో, ఇద్దరిని చంపటమే కాకుండా, ఆస్థులు ధ్వంసం చెయ్యటం, చీని చెట్లు నరకటం వంటివి చేస్తూ, ప్రత్యర్ధులను భయపెడుతున్నారు. చంద్రబాబు కూడా 15 రోజుల క్రిందట తాడిపత్రిలో పర్యటించి, చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించారు. ఈ నేపధ్యంలో, అనంతపురం జిల్లాలో జేసీ ఫ్యామిలీ కూడా బాధితులుగా ఉన్నా, ఇప్పటి వరకూ భరిస్తూ వచ్చారు. ఇక మీదట చూస్తూ ఊరుకోమని, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా తాడిపత్రిలో, వైసీపీ ఎమ్మె ల్యే పెద్దారెడ్డి ఆగడాలు రోజు రోజుకీ పెరిగి పోతున్నాయని, రాజకీయ కక్ష సాధింపులే కాకుండా, అభివృద్ధిని కూడా అడ్డుకుంటున్నారని జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు.

jc 19072019 2

తాడిపత్రిలో పరిశ్రమలు పెట్టిన వారిని ఇబ్బంది పెడుతున్నారని, తాడిపత్రి అభివృద్ధి చెందింది అంటే, పరిశ్రమల వల్లే అనే విషయం గుర్తు పెట్టుకోవాలని జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. వైసీపీ ఎమ్మె ల్యే పెద్దారెడ్డి తాడిపత్రి ప్రాంతంలోని, అర్జాస్‌ స్టీల్‌ప్లాంట్‌, సాగర్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ, పెన్నాసిమెంట్‌ ఫ్యాక్టరీ, అలా్ట్రటెక్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీల్లోని లారీల ట్రాన్స్‌పోర్టులను కమిషన్ కోసం బెదిరిస్తున్నారని, ఇది మంచి పధ్ధతి కాదని అన్నారు. పరిశ్రమల పై దాడులు చేసి,వ్ ఆరిని బెదిరిస్తే , ఇక నుంచి చూస్తూ ఊరుకోమని అన్నారు. రెండు నెలలుగా అన్నీ భరిస్తున్నాం అని, పధ్ధతి మార్చుకుంటారు అని చూసామని, ఇక మాకు ఓపిక లేదు, తాడిపత్రికి అన్యాయం చెయ్యాలని చూస్తే, కుదరదని అన్నారు. మీ పై ఎవరైనా ఎదురు మాట్లాడితే, అక్రమ కేసులు పెట్టి, లోపల వేయిస్తున్నారని, ఇలాంటి చర్యలకు ఎవరూ భయపడరని అన్నారు.

jc 19072019 3

మీరు సంపాదించుకోవటానికి రాజకీయాల్లోకి వచ్చారు, ఇద్దరు కొడుకుల చేత కంపెనీలు పెట్టించావ్, సంపాదించుకొండి, కాని వేరే పరిశ్రమల జోలికి వెళ్లి దందాలు చేస్తే మాత్రం ఊరుకోనని హెచ్చరించారు. గతంలో తాడిపత్రి పట్టణంలో, ప్రతి చికెన్ షాప్, కిలో 140 రూపాయలకు అమ్మాలని సూచిస్తే, అందరూ అలాగే అమ్మారని, అప్పుడు పెద్దారెడ్డి, కిలోకి 20 రూపాయలు నాకు కమిషన్ ఉందని ఆరోపించారని, ఇప్పుడు కిలో చికెన్ 200కు అమ్ముతున్నారని, అంటే, పెద్దారెడ్డికి, కిలో 80 రూపాయలకు కమిషన్ వస్తుందా అని ప్రశ్నించారు. నీ చెంచాలను అడ్డు పెట్టుకుని, తమ పై ఏవో ఆరోపణలు చేస్తే, మేము ఏమి బెదిరిపోమని మాజీ ఎమ్మెల్యే జేసీప్ర భాకర్‌రెడ్డి అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read