టీడీపీ నేత ఎంపీ. జేసీ దివాకర్ రెడ్డికి చెందిన కాలేజీల్లో ఎన్నికల అధికారులు తనిఖీలు నిర్వహించారు. అనంతపురం జిల్లాలోని యాడికి ప్రాంతంలో జేసీ కుటుంబానికి చెందిన జూనియర్ కాలేజీల్లో ఎన్నికల స్క్వాడ్ సోదాలు జరిపింది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పెద్ద ఎత్తున డబ్బులు దాచిపెట్టారని ఫిర్యాదు రావడంతో తనిఖీలు నిర్వహించామని రెవెన్యూ, పోలీసు అధికారులు తెలిపారు. తనిఖీల్లో భాగంగా ఎలాంటి నగదు కూడా లభ్యం కాలేదని అధికారులు తెలిపారు. కేవలం కరపత్రాలు, పార్టీ ఎన్నికల సామాగ్రి మాత్రమే లభ్యమైనట్లు పేర్కొన్నారు.

game 27032019

ఇదిలా ఉంటే ఇప్పటికే రాష్ట్రంలోని పలువురు రాజకీయ నాయకుల ఇళ్లపై ఎన్నికల స్క్వాడ్, అలాగే ఐటీ శాఖ అధికారులు వరుసగా సోదాలు నిర్వహించడం కలకలం రేపుతోంది. ఇప్పటికే కడప జిల్లాలో పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు జరపడంపై తెలుగు దేశం శ్రేణులు భగ్గుమంటున్నాయి. మరో నేత సీఎం రమేష్ ఇళ్లపై కూడా ఎన్నికల అధికారులు సోదాలు నిర్వహించారు. కాగా కేంద్ర ఎన్నికల సంఘం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read