అనంతపురం జిల్లా, తాడిపత్రి మునిసిపాలటీ, అనేక ట్విస్ట్ లు మధ్య, టెన్షన మధ్య చివరకు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. గత నాలుగు రోజులు నుంచి, గంట గంటకు మలుపులు తిరుగుతూ, టెన్షన్ పెడుతూ, ఏ పార్టీ కైవసం చేసుకుంటుంది, టిడిపి నాయకులు ప్రలోభాలకు లొంగకుండా ఉంటారా, వైసీపీ అధికారబలం ఉపయోగించి ఏమి చేస్తుంది, అనే నేపధ్యంలో, ఈ రోజు 11 గంటలకు, అనుకున్న విధంగా జేసీ దివాకర్ రెడ్డిని చైర్మెన్ గా ఎన్నుకోవటం, అలాగే వైస్ చైర్మెన్ గా టిడిపి నుంచి ఎన్నుకోవటంతో, తాడిపత్రి మునిసిపాలిటీలో ఈ ఉత్కంటకు తెర పడిందని చెప్పుకోవచ్చు. అనుకున్న ప్రకారమే తెలుగుదేశం పార్టీకి 18 కౌన్సెలర్లు, అదే విధంగా వైసీపీకి 16 ఉండటంతో, ఎక్స్ అఫీషియో వోటు ద్వారా, ఎమ్మెల్యే, ఎంపీ ఓటుతో, వైసీపీకి 18 వచ్చినా, అటు సిపిఐ, ఇండిపెండెంట్ అభ్యర్ధులు టిడిపికి మద్దతు ఇవ్వటంతో, టిడిపికి 20 మంది మద్దతు వచ్చింది. జేసి దివాకర్ రెడ్డి, మూడో సారి తాడిపత్రి మునిసిపల్ చైర్మెన్ గా బాధ్యతలు చేపట్టారు. అయితే ఇది ఇలా ఉండగా, ఎన్నిక తరువాత బయటకు వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. తాను ఎన్నిక కావటానికి జగన్ రెడ్డి, వదిలేయటమే కారణం అనుకుంటున్నా అని, వాళ్ళు తలుచుకుంటే, మమ్మల్ని ఎన్నుకునే అవకాశమే వచ్చేది కాదు అంటూ, స్పందించారు.
అయితే ఆయన ఈ వ్యాఖ్యలు సీరియస్ గా చేసినా, వ్యంగంగా చేసినా, టిడిపి నేతలు గట్టిగా నిలబడబట్టే, ఈ రోజు మేము గెలిచాం అని తెలుగుదేశం నేతలు అంటున్నారు. ఇక జేసీ మాట్లాడుతూ, సేవ్ తాడిపత్రి నినాదంతో, ఈ ఎన్నికకు వెళ్ళాం అని, ప్రజలు మమ్మల్ని ఆదరించారని అన్నారు. తాడిపత్రిని కాపాడుకోవటానికి, అభివృద్ధి చేయటానికి, అవసరం అయితే తాను జగన్ మోహన్ రెడ్డిని కలుస్తానని, అలాగే మంత్రి బొత్సాని కూడా కలుస్తాను అంటూ, జేసీ సంచలన వ్యాఖ్యలు చేసారు. మా ఎంపీకు, అలాగే మంత్రి పెద్దిరెడ్డి కూడా లేఖలు రాసి, అభివృద్ధి చేయమని అడుగుతానని అన్నారు. ఇక నుంచి ఇక్కడ రౌడీయిజం కుదరదని అన్నారు. తాడిపత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి, మళ్ళీ వారాల్లోకి ఎక్కిస్తానని, తాడిపత్రిని అభివృద్ధి చేయకుండా ఎవరూ ఆపెలరని అన్నారు. తమ అభ్యర్ధులకు ఎన్ని ప్రలోభాలు వచ్చినా, గట్టిగా నిలబడ్డారని, ఒక్కొక్కరు ఒక బాహుబలి, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి అంటూ, తమ పార్టీ అభ్యర్ధులని జేసీ కొనియాడారు.